* అర్హులకు సంక్షేమ పథకాలన్నీ అందాల్సిందే
* అర్హుల‌కు ఇంటి పట్టా రాలేదనే మాట వినిపించకూడదు
* సీఎంఓ అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి – జనాస వార్త
————————————–
అర్హత ఉండి ఇంటి పట్టా రాలేదనే మాట వినిపించ కూడదు అని సీఎం కార్యాలయ అధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించా లన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతోసీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘పేదల సంక్షేమం కోసం మనం యజ్ఞం చేస్తున్నాం. అర్హులకు పథకాలన్నీ అందాల్సిందే. పెన్షన్, బియ్యం కార్డు, ఇంటి పట్టాలకు సంబంధించి సచివాలయాల్లో పెండింగ్‌ దరఖాస్తులు ఉండ కూడదు. అర్హులైన వారికి 10 రోజుల్లో పెన్షన్, బియ్యం కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇంటి పట్టా ఇవ్వాలి. ఎన్ని రోజుల్లో అందిస్తామనే విషయాన్ని తెలిపేలా సచివాలయాల్లో బోర్డు ఏర్పాటు చేయాలి. అమ్మఒడి పథకానికి అధికారులు సిద్ధం కావాలి’ అని సీఎం ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *