శ్రీకాకుళం – జనాసవార్త
———————————-
శ్రీకాకుళంలోని ఆర్. అండ్ .బి. గ్రౌండ్ ను మినీ స్టేడియంగా మార్చ వలసినదిగా క్రీడాకారులు, వాకర్స్, పట్టణ వాసులు కలసి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ను కోరుతున్నారు. పాత శ్రీకాకుళం క్రీడాకారులు, వాకర్స్ కోడి రామ్మూర్తి స్టేడియం వెళ్లాలన్నా, ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ కు వెళ్లాలన్నా సుమారుగా 5 కిలోమీటర్లు దూరం వెళ్లడం శ్రమతో కూడుకొన్న పని. దీన్ని బట్టి ఆర్.అండ్.బి. గ్రౌండ్ ను మినీ స్టేడియం గా మార్చడం వలన పేద, బడుగు బలహీన వర్గాల క్రీడాకారులకు మేలు జరుగుతుందని పాత శ్రీకాకుళం వాసులు అభిప్రాయ పడుతున్నారు. బాల బాలికలకు, మహిళలకు ఆర్. అండ్ .బి. గ్రౌండ్ ను మినీ స్టేడియంగా మార్చడం వల్ల మరికొంత మంది నూతన క్రీడాకారులు తయారవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా డచ్ వారి భవనానికి మరమ్మతులు చేస్తే ఇటు క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు మేలు జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్. అండ్ .బి. గ్రౌండ్ ను మినీ స్టేడియం గ మార్చడం వల్ల ఆగస్టు 15, జనవరి 26 వేడుకలను ఇక్కడ జరిపించడం వలన ప్రభుత్వానికి మేలు జరుగు తుంది. ఆర్. అండ్ .బి. గ్రౌండ్ ను మినీ స్టేడియం గా మార్చడానికి కేవలం రూ. 20 లక్షలు నిధి సరిపోతుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జె.నివాస్ దీనిపై దృష్టి సారించి వలసిందిగా వినయ పూర్వకంగా ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *