(టి.వి.సుబ్బయ్య)

“ చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవై యనట్లు ‘ అన్న శతకకారుడి వాక్యం ‘ నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజమవుతోంది . ప్రజలు కష్టపడి బ్యాంకుల్లో డిపాజిట్లుగా దాచుకున్న డబ్బు అప్పులు కావాలని ఎగవేస్తున్న దొంగల పాలవుతోన్న వాస్తవమే . నేటి విషాదం . 2020 లో కరోనా మహమ్మారి సృష్టించిన విలయంలో పడి ప్రజలు గిలగిల కొట్టుకున్నారు . కొన్ని బడా కార్పొరేట్లు ఏనాడూ లేనంతగా తమ సంపద పెంచుకున్నారు . పరిశ్రమలు , వాణిజ్య , వ్యాపార సంస్థలు మూతపడ్డాయి . వాహినీ వారి పెద్ద మనుషులకు ప్రభుత్వం లక్షా 45 వేల కోట్లు పన్ను రాయితీ లిచ్చింది . వ్యాపారులకు రుణాలపై వాయిదాల చెల్లింపుపై ఇచ్చిన మారిటోరియం గడువు ముగిసింది . తిరిగి వాయిదాలు చెల్లించవలసిందే . కొవిడ్ కారణంగా బ్యాంకులకు బడా వాణిజ్య , పారిశ్రామికవేత్తలు చెల్లించ వలసిన రుణ బకాయిలు ( ఎగవేతలే అవుతాయి ) రూ . కోట్లు ఉండవచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు . ఇలాంటి హెచ్చరికను రిజర్వు బ్యాంకు గతంలోనే చేసింది . ఈ బకాయిలకు నిరర్థక ఆస్తులుగా ముద్దు పేరు పెట్టి అనేక లక్షల కోట్లను ప్రభుత్వాలు రద్దు ఈసారి కూడా ప్రభుత్వం అదే చేయడానికి సిద్ధమైంది . సుప్రీంకోర్టు ఎప్పీలుగా ప్రకటించాలన్న ప్రభుత్వ కోర్కెను నిలిపి ఉంచింది . కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నారు . ఆదివాలా చట్టాన్ని విని యోగించి రుణ బకాయిలను రద్దు చేయడం పాలకులకు అలవాటే కదా ! సంక్షోభాన్ని ఎదుర్కోనున్న బ్యాంకులకు మరోసారి మూలధన పెట్టుబడు లను బడ్జెట్ అయిన తర్వాత అందించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమవుతోందని అధికార యంత్రాంగం సమాచారం . ఈ ఏడాది జూలైలో రిజర్వుబ్యాంకు విడుదల చేసిన ‘ ఆర్థిక సుస్థిరత నివేదికలో కొవిడ్ -19 కారణంగా స్థూల ఎపులు రెండు , దశాబ్దాల కాలంలో లేనంత స్థాయికి 12.5 శాతానికి చేరుకోవచ్చునని తెలిపింది . అంతే కాదు . సూక్ష్మ ఆర్ధిక వాతావరణం మరింతగా దిగజారితే స్థూల ఎప్పీ నిష్పత్తి 14.5 శాతానికి చేరుకోవచ్చునని కూడా ఆ నివేదిక వెల్లడించింది . కొవిడ్ కు ముందే కుదేలైన ఆర్థిక వవ్యస్థ కొవిడ్ కాలంలో మాంద్యంలోకి జారుకుంది . ఉత్పత్తి రంగం స్తంభించిపోయి ఇప్పుడిప్పుడే ప్రారంభ మైంది . పేదలు , వివిధ చిన్న చిన్న వృత్తులు చేసుకొని వెళ్లబుచ్చుతున్నవారు , చిన్న , సన్నకారులు , దిగువ మధ్య జనం వద్ద డబ్బులేక వస్తువుల కొనుగోలు డిమాండ్ పూర్తిగా పడిపోయింది . మొత్తం రుణాలలో స్థూల నిరర్థక ఆస్తులు 12-15 శాతంగా ఉండ వచ్చునని ఆర్థిక కేసుల విభాగం మాజీ కార్యదర్శి డి . కె . మిట్టల్ అంచనా వేశారు . ఇదే విభాగంలో పనిచేసిన మరో మాజీ ప్రకారం పారుబకాయిలు 6-9లక్షల కోట్ల రూపాయలంటారు . ప్రభుత్వం తొలి నుండి బకాయిలను వసూలు చేయకుండా రద్దుచేసి ప్రజలను మోస గిస్తూనే వస్తోంది . ఈ అంశాన్ని ప్రజలు తీవ్రంగా తీసుకొని స్పందించక పోవడమే ప్రధాన కారణం . పెద్ద మనుషులంటే బుద్దులన్నీ వేరయా ‘ అంటూ ఒక రచయిత హెచ్చరించారు . ఆర్థికశాఖ మరో మాజీ కార్యదర్శి సుభాష్ చంద్రగార్గ్ అంచనా ప్రకారం ఎన్‌పీఏలు రు . 9 నుండి 10 లక్షల కోట్లు ఉంటాయి . బకాయిలు వసూలు చేయలేని రుణాల పునర్వ్య వస్థీకరణ పథకాన్ని 2020 మార్చిలో ప్రకటించింది . ఈ పథకం కింద 2020 డిసెంబరు 31 వరకు రుణ బకాయిల వాయిదాల చెల్లింపు గడువును పొడిగించాలని కోరుతూ విజ్ఞప్తులు అందించడానికి రిజర్వు బ్యాంకు అనుమతించింది . ఆ తర్వాత రుణ బకాయి దారులు దివాలా చట్టాన్ని తాత్కాలికంగా వినియోగించుకోకుండా నిలిపి వేయడానికి కేంద్రప్రభుత్వం అనుమతించింది . ప్రస్తుతం ‘ చెల్లించని బకాయిల ‘ మొత్తాలను ప్రకటించడానికి సిద్ధంగా లేవు . పునర్వ్యవస్థీకరణ రుణాల అందుబాటును ప్రకటిస్తే స్పష్టత వస్తుందని ‘ ఇక్రా క్రిసిల్ ‘ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేశాయి . అలాగే 2019 మార్చినాటికి బ్యాంకుల్లో ఎస్పీలు 9 , 1 శాతం ఉండగా 2020 నాటికి అవి 8.5 శాతానికి తగ్గాయని రేటింగ్ ఏజెన్సీలు చెప్తున్నాయి . అయితే కరోనా మహమ్మారి పెరిగాయని క్రిసిల్ సీనియర్ డైరెక్టరు కృష్ణన్ సీతారామన్ వెల్లడించారు . అలాగే 2021 మార్చినాటికి స్థూల నిరర్థక ఆస్తులు 11-11.5 శాతానికి చేరుకోవచ్చునని ఆయన అంచనా వేశారు . ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఉన్నా యని , అవి 8 , 2 లేదా 9 లక్షల కోట్లకు చేరుకుని ఉంటాయని ఇక్రా ఏజెన్సీ ఉపాధ్యక్షుడు అనిల్ గుప్తా తెలిపారు . అనేక ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల ఆర్థిక పరిస్థితి సజావుగా లేదని తెలిపాయి . ఆర్థిక కార్యకలాపాలు అంతిమంగా సాధారణ ప్రజలు , డిపాజిట్ దారులు ప్రభుత్వం గానీ ప్రజలు నష్టాలు భరించనవసరం . వ్యవస్థను దీర్ఘకాలంగా రూపొందించ లేక పోయింది . ప్రభుత్వరంగ బ్యాంకు లను ప్రైవేటు రంగానికి కట్టబెట్టేందుకు పూనుకున్న మోదీ ప్రభుత్వానికి గానీ అంతకుముందున్న ప్రభుత్వాలకుగానీ ప్రజానుకూల బ్యాంకింగ్ వ్యవస్థను రూపొందించాలన్న లక్ష్యం లేదని అర్ధం చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *