కత్తిపూడి, తూర్పుగోదావరి
————————————
సృజనాత్మక గణిత నమూనా తయారీ విభాగంలో కత్తిపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల  తొమ్మిదో తరగతి విద్యార్థిని సమ్మంగి శ్రావణి ప్రథమ స్థానం సాధించింది. ఇబ్రహీంపట్నంలో 31.12.2020 న నిర్వహించిన రాష్ట్ర స్థాయి గణిత దినోత్సవం వేడుకలు – 2020 లో సృజనాత్మక గణిత నమూనా తయారీ విభాగంలో కత్తిపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థిని సమ్మంగి శ్రావణి పాల్గొన్నది. ఇందులో ఈమె ప్రథమ స్థానం సంపాదించింది. ఈ గణిత నమూనా తయారీకి గైడ్ టీచర్ గా గణిత ఉపాధ్యాయులు ఎస్.వెంకటేశ్వర రావు వ్యవహరించారు. విజేత శ్రావణికి ప్రశంసా పత్రం, జ్ఞాపిక, 2000 రూపాయలు నగదు బహుమతిని పాఠశాల విభాగం సంచాలకులు వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎస్సీఆర్టీ డైరెక్టర్ ప్రతాపరెడ్డి సంయుక్తంగా
అందజేసారు. విజేత శ్రావణిని ప్రత్తిపాడు శాసన సభ్యులు పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ గారు, జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం, పిఠాపురం డివిజన్ ఉప విద్యాశాఖ అధికారిణి వై.జయలక్ష్మి, శంఖవరం ఎంపీడీవో రాంబాబు, ఎంఈఓ. ఎస్.వెంకట రమణ, గౌతు నాగు, గౌతు అర్జుబాబు, తల్లి దండ్రులు కమిటీ చైర్మన్ వెలగా బుల్లి పాపారావు, వైస్ చైర్మన్ సింగంపల్లి గంగా లక్ష్మి, ప్రధాన ఉపాధ్యాయులు సత్య లింగేశ్వర రావు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *