* ధరఖాస్తుల సమర్పణకు గడువు జనవరి 12 
* దళారులను నమ్మి మోసపోవద్దు

శంఖవరం – తూర్పుగోదావరి జిల్లా
——————————————————
అంగన్ వాడీ కార్యకర్త, సహాయకురాలు ఉద్యోగాలకు ఈ నెల 12 తేదీ సాయంత్రం 5 గంటలలోగా ధరఖాస్తులు చేసుకోవాలని శంఖవరం సమగ్ర శిశు అభివృద్ధి పధకం అధికారిణి ఊర్మిళ శనివారం ఓ ప్రకటనలో కోరారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండలాల పరిధిలో అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగ ఖాళీలు 2 , సహాయకురాలు ఉద్యోగాల ఖాళీల 18 చొప్పున ఉన్నాయని ఆమె వెల్లడించారు. కార్యకర్తల ఉద్యోగాలకు అభ్యర్థినిలు విధిగా 10 వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని, ధరఖాస్తులు చేయు అభ్యర్థినులు 01.07.2020 నాటికి 21 సంవత్సరాలు పూర్తిగా నిండి, 35 సంవత్సరాల లోపు వారయి ఉండాలని, అర్హులైన స్థానిక వివాహిత మహిళా అభ్యర్థినులు మాత్రమే అర్హులని ఆమె ప్రకటించారు. అర్హులైన దరఖాస్తు దారులకు సెలెక్షన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహిసిస్తారని, అభ్యర్థినులు దరఖాస్తులను శంఖవరంలోని పధకం కార్యాలయము నుండి పొంది, పూర్తి స్థాయిలో పూర్తీ చేసిన దరఖాస్తులను తిరిగి శంఖవరం ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ నందు అందజేసి రసీదు పొందాలని ఊర్మిళ వివరించారు. అర్హులైన అభ్యర్థినిలకు మౌఖిక పరీక్ష కొరకు కాల్ లెటర్స్ పంపిస్త్తామని శంఖవరం సమగ్ర శిశు అభివృద్ధి అధికారిణి ఊర్మిళ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *