* అర్హూలందరికీ ఇల్లు, ఇళ్ళ స్థలం – ఎమ్మెల్యే
పర్వత
* మండలంలో ఇంటి పట్టాలకు శుభారంభం

శంఖవరం – తూర్పుగోదావరి జిల్లా
———————————————–
12.04 .2019 ఎన్నికల్లో 25 లక్షల మందికి ఇళ్ళు, ఇళ్ళు స్థలాలను ఇస్తామని ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చిన వైఎస్. జగన్ నేడు ముఖ్యమంత్రి హోదాలో తొలి దశలో 35 లక్షల మందికి ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తున్నారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ పేర్కొన్నారు. కులం, మతం, పార్టీ, ప్రాంతాల వివక్షకు, భేషజాలకు అతీతంగా అర్హూలందరికీ పారదర్శకంగా, చిత్త శుద్ధితో ఇల్లు, ఇళ్ళ స్థలం పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంల శంఖవరం మండలం మండపం గ్రామంలో నవరత్నాలు – పేదలందరికీ ఇండ్లు/ స్థల పట్టాల పంపిణీ / వైఎస్సార్ జగనన్న కాలనీ నిర్మాణం పధకంలో భాగంగా తొలి దశలో 249 మంది లబ్దిదారులకు సంబంధించిన ఇండ్ల స్థల పట్టాలను ఎమ్మెల్యే లాంఛనంగా ఆదివారం సాయంత్రం పంపిణీ చేసారు. ముందుగా గ్రామ ప్రజలంతా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. స్థానిక విద్యార్థినిలు వందేమాతరం జాతీయ గీతాలాపన చేయగా, జ్యోతీ ప్రజ్వలనంతో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి సందేశాన్ని మండల విద్యాశాఖ అధికారి వెంకటరమణ చదివి సభకు వినిపించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, గ్రామ ప్రజలు, సభికులను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు.

ప్రతీ బిడ్డ విద్యాభివృద్ధికి జగనన్న అమ్మ ఒడి పధకం లక్షలాది కుటుంబాలకు విద్యా వెలుగులు అందిస్తున్న దన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల్లోని ప్రతీ రైతుకూ రైతు భరోసా అందుతోందన్నారు. వైఎస్సార్ ఆసరా పధకం గురించి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయల డ్వాక్రా రుణాలను జగన్ మాఫీ చేశారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి అధికారంలో ఉంటే సుమారు 46 పైగా ప్రభుత్వ సంక్షేమ పధకాలు అర్హూలందరికీ అందుతాయని ఎమ్మెల్యే వివరించారు. ఇంకా పలు విషయాలను ఆయన కూలంకషంగా సభికులకు వివరించారు. గృహ నిర్మాణ శాఖ డిఈ. సురేష్ బాబు మాట్లాడుతూ గుడా, నాన్ గుడా గ్రామాల్లో ఈ పధకాల గురించి వివరించారు. ఈ గ్రామంలో 420 మందికి ఇంటి పట్టాలిస్తున్నామని, భవిష్యత్తులో ఈ ఊరికి రూ. 4.20 కోట్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది వివరించారు.

డిసీసీబీ. డైరెక్టర్ శెట్టిబత్తుల కుమార్ రాజా మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలు అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలనే సత్సంకల్పంతో సుమారు 46 సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి విజయ వంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకనాటి ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో ఇళ్ళ స్థలాలను ఇవ్వాలని సంకల్పించి మూడు సార్లు ప్రయత్నించి విఫలం అయ్యారని, ఆయన కుమారుడు నేటి ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని లక్షలాది నిరుపేదలకు ఇళ్ళ స్థలాలను, ఇండ్లను ఇస్తున్నారని తాహసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం అన్నారు. ఇప్పటి లబ్దిదారులు కాక ఇంకా మిగిలిన అర్హులైన వారూ ఇళ్ళ స్థలాలు, ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉందని, సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో. రాంబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ సహాయక ఇంజనీర్ వెంకటరమణ,
ఈవోపీఆర్డీ కాశీవిశ్వనాధ్, ఉపాధి పధకం ఏపీఓ. సత్యనారాయణ, మండపం సచివాలయం 1 కార్యదర్శి నాగమణి, వీఆర్వోలు లోవరాజు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, అన్నవరం ఎంపీటీసీ. సభ్యుడు దడాల సతీష్ , మహిళా పోలీస్ గౌతమి , సచివాలయం సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *