ప్రత్తిపాడు – తూర్పుగోదావరి
——————————————–
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడులో భారతీయ జనతా పార్టీ ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో సుమారు 15 నెలల కాలంగా హిందూ దేవాలయాలు, హిందూ దేవీ దేవతల విగ్రహాలను, రధాలను, ఆస్తులను ఒక కుట్ర ప్రకారం ద్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ అందుకు నిరసనగా ఈ ర్యాలీని నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయిన తరువాత పిఠాపురంలో హిందూ విగ్రహాలు ద్వంసం చేయడం, అంతర్వేది లక్ష్మినరసింహస్వామి వారి రధం నిప్పు పెట్టి భస్మం చేయ్యడం, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి వస్తువులు మాయమవ్వడం, వినాయక, ఆంజనేయ, సీతారాముల విగ్రహాలను ద్వంసం చేయడం, రామతీర్డం కొండపై రామాలయంలోని శ్రీరాముని విగ్రహం శిరస్సు ఖండించడం వంటివి సుమారుగా 125 దుశ్చర్యలు జరిగాయి. హిందూ మతస్తుల సహనాన్ని కొన్ని దుష్ట శక్తులు పరీక్షిస్తున్నాయని, ఈ తరహా ఘటనల్లోని దోషులు ఎవరినీ ఇంత వరకు పోలీసులు అదుపులోకి తీసుకోలేదని, కానీ చర్చిల వద్ద ధర్నా చేస్తే రాళ్ళు విసిరారని కేసులు పెట్టి
సుమారు నెల రోజుల వరకూ బెయిలు రాని విధంగా జైలులో పెట్టారని, హిందూ దేవీ దేవతలపై ఇంత ఘోర సంఘటనలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని,
హిందువుల పట్ల చాల పెద్ద కుట్రే జరుగు తున్నదనీ, హిందువులు మేలుకో వలసిన సమయం వచ్చిందని, ముస్లీం, బ్రిటీష్ పాలనలను చరిత్ర చదివాం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నా మనీ, ప్రభుత్వం పరిపాలన ఇలాగే కొనసాగితే ముందు ముందు హిందువులు ఇంకెన్ని ఇబ్బందులు పడాలో ఆలోచించండి అంటూ తూర్పు గోదావరి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు సింగిలిదేవి సత్తిరాజు మీడియాతో అన్నారు. బి.జె.పి.మండల అద్యక్షులు పత్రి రమణ, మదినే బాబ్జీ, రాసంశెట్టి రాజా, కార్యకర్తలు ఈ రాలీలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *