( ఆర్టీఐ ఉద్యమకర్త సోమిరెడ్డి రాజు )

యస్.రాయవరం – విశాఖ జిల్లా
—————————————————-
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గం యస్.రాయవరం మండలంలోని రెవిన్యూ అధికారుల మాయాజాలంపై పోరుకు ఈ నెల 18న సన్నద్ద మవుతున్నారు. మండలం లోని వివిధ గ్రామ పంచాయతీలలోని కొందరు రెవిన్యూ అధికారుల తీరువల్ల కొన్ని భూములకు రెక్కలు వచ్చాయి. ఆ భూములు రెక్కలు కట్టుకుని సాక్షాత్తూ అవినీతి, అక్రమార్కుల భూముల జాబితాలో రహస్యంగా చేరిపోయాయి. నిజమైన భూ యజమానులకు అన్ని యాజమాన్య హక్కు పత్రాలు ఉన్నప్పటికీ కొన్ని భూములు మాత్రం తప్పుడు పత్రాలతో వక్ర మార్గంలో అక్రమార్కుల పేరున రెవిన్యూ రికార్డులలో నమోదు అయ్యి పోయాయి. పైగా వాటికి పట్టాదార్ పాస్ పుస్తకాలూ మంజూరు అయ్యాయి. అలా లక్షలాది రూపాయల విలువైన భూములకు రెక్కలొచ్చాయి. లక్షలాది రూపాయల విలువైన తమ భూములను పరాయి వ్యక్తులకు దారాదత్తం చేయడానికి రెవిన్యూ అధికారులు ప్రయత్నo చేస్తున్నారనే సత్యాన్ని బాధితులను రైతాంగం ఆలస్యంగా గుర్తించింది. ఈ బాధితులు వారి రికార్డులు పట్టుకొని యస్.రాయవరం తాహశీల్దార్, నర్సీపట్నంసబ్ కలెక్టర్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతూ తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని కోరుతూ ఉన్నారు. ఐనా న్యాయం జరగక పోవడంతో సోమవారం 18.01.2021  ఉదయం 10.00 గంటలకు యస్.రాయవరం తహశీల్దార్ కార్యాలయం వద్ద పోరు సాగించ డానికి నిర్ణయించారు. ఆ 10 మంది బాధిత రైతు కుటుంబాలూ తహశీల్దార్ కు వినతిపత్రం ఇచ్చి ఆపై రెవెన్యూ మాయాజాలంపై మీడియా ముందుంచి రెవెన్యూ అధికారుల బాగోతాన్ని బట్ట బయలు చేయాలని నిర్ణయించారు. అనంతరం సమాచార హక్కు చట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు నేతృత్వంలో భాదితులు అందరూ పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుని స్వయంగా కలసి తమ భూముల అన్యాక్రాంతం సమస్యలను వ్రాత పూర్వకంగా ఫిర్యాదు రూపంలో అందించాలని, న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించడం ద్వారా, తమకు న్యాయం చేయాలని  కోరడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *