* కాంట్రాక్టర్లకు జాయింట్ కలెక్టర్ లక్ష్మిశ హుకుం

కాకినాడ, తూర్పుగోదావరి
———————————————–
జిల్లాలో వివిధ ఇసుక ఓపెన్ రీచ్ ల నుండి రోజుకు 50 వేల మెట్రిక్ టన్నుల ఇసుక తీయాలని కాంట్రాక్టర్లను జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) జి.లక్ష్మిశ ఆదేశించారు. సోమవారం జాయింట్ కలక్టర్ జి.లక్ష్మిశ కలక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బోర్డు,మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇరిగేషన్, ఇసుక ఓపెన్ రూచ్ కంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలక్టర్ మాట్లాడుతూ ఇసుక అనేది ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలలో ప్రధాన మైందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 40 లక్షల మెట్రిక్ టన్ను ఇసుక అవసరరాలు ఉన్నాయన్నారు. 50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంతో ఒక్కొక్క రీచ్ నుండి రోజుకు ఐదు వేల మెట్రిక్ టన్నుల ఇసుకను తీయాలన్నారు. జిల్లాలో నవరత్నాలు -పేదలందరికీ ఇళ్ళ నిర్మాణాలకు 37 లక్షల మె.ట. ఇసుక అవసరం అవుతుందన్నారు. అదే విధంగా రైతు భరోసా కేంద్రాలు, గ్రామసచివాలయ భవనాల నిర్మాణాలు, ఇతర నిర్మాణాలకు మూడు లక్షల మె.ట. ఇసుక అవసరం అవుతుందన్నారు. ఈ దిశగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ పొందిన ఇసుక కంట్రాక్టర్లు లక్ష్యాలకు అనుగుణంగా ఇసుకను సిధ్ధం చేయాలన్నారు. ఇసుకను త్వరిత గతిన తీసుకునే విధంగా ప్రభుత్వం సెమి మెకనైజ్డ్ మిషన్లను అనుమతించారన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇరిగేషన్ శాఖల నిబంధనల ప్రకారం ఇసుకను త్రవ్వే రీచ్ ల వద్ద డెప్త్, ఫ్లడ్ బ్యాంక్, స్ట్రక్చర్ నుండి 500 మీటర్ల దూరం వంటి అంశాలను కాంట్రాక్టర్లు పాటించాలన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేపట్టకపోతే, అనుమతి పొందిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్ట్ ను రద్దు చేసి వేరొక కాంట్రాక్టరుకు అనుమతులను ఇస్తామని జేసి స్పష్టం చేశారు. రీచ్ల వద్ద వచ్చిన సాంకేతిక ఇతర సమస్యలు ఉన్నట్లైతే నేరుగా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకుని రావాలని మైనింగ్ అధికారులకు జేసి లక్ష్మిశ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఇ.బి.అవరేషన్ ఎస్.పి.లు సుమిత్ గార్గ్, రమాదేవి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇరిగేషన్, మైనింగ్ అధికారులు తో పాటు ఇసుక ఓపెన్ రిచ్ ల కంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *