శంఖవరం – తూర్పుగోదావరి
——————————————-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామ రాజ్య స్థావనకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా తాము ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధమని శంఖవరం మండల పార్టీ అధ్యక్షుడు, విలేఖరి పడాల నాగేశ్వరరావు (నాగు) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేసారు. విజయనగరం జిల్లాలోని రామతీర్దం గ్రామ పర్యటనకు వెళుతున్న బీజేపీ కార్యకర్తలను కొందరిని పోలీసులు గృహ నిర్భంధం చేయడం, మరి కొందరు తూర్పు గోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులను దారి మధ్యలో అదుపులోనికి తీసు కోవడం ప్రభుత్వ నిరంకుశత్వంగా తాము భావిస్తున్నామని, దీనిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. ఇదేవిధంగా ఇక ముందు కూడా కొనసాగితే రామరాజ్యం స్థాపన కొరకు ఏలాంటి ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఆలయాలకు రక్షణ కల్పించ వలసిన ప్రభుత్వం నిద్ర పోతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పుటి వరకు హిందూ దేవాలయాలపై జరిగిన దాడుల ఘటనలలో ఏ ఒక్క నిందితుడిని ప్రభుత్వం అరెస్టు చేయలేక పోయిందని, ఇప్పుడు రామ తీర్థలో రాముడు విగ్రహం తలను దుండగులు నరకడం రాష్ట్ర ప్రభుత్వ భద్రతా వ్యవస్థ అచేతనానికి నిదర్శనమని నాగు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరును మార్చుకొని హిందూ దేవాలయాలపై దాడి చేసిన వారిని పట్టుకొని, వారిపై కఠిన చర్యలు తీసు కోవాలని బీజేపీ శంఖవరం మండల శాఖ అధ్యక్షులు పడాల నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మా వ్యాఖ్య :

(ఆయన దృష్టిలో రామ రాజ్యం అంటే ఏమిటో, అది సాధనకు ఏ తరహా ఉద్యమం చేపడతారో ఆ ప్రకటనలో ఆయన పేర్కొన లేదు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *