కత్తిపూడి – తూర్పు గోదావరి
——————————————-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరు స్థితి మంతులకు భూమి ఓ సామాజిక హోదా… పేదలకు మాత్రం కనీస అవసరం … దేశంలో కొందరు బడా బాబులు వందలాది ఎకరాల భూములను హస్త గతం చేసుకుని వ్యాపారం చేసుకుంటుంటే…  లక్షలాది మంది నిరుపేదల కుటుంబాలు నివసించ డానికి చారెడు సొంత జాగా లేక నిత్యం నానా అవస్థలు పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి నిరుపేదల ఆశలను, కలలను ” నవరత్నాలు – పేదలందరికీ ఇండ్లు/ స్థల పట్టాల పంపిణీ / వైఎస్సార్ జగనన్న కాలనీ నిర్మాణం పధకం ” లో ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఇంటిని, ఇంటి స్థలాన్ని అర్హులైన ప్రతీ నిరుపేద కుటుంబానికీ అందిస్తోంది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడిలో ఇళ్ళ స్థలాల పట్టాలను పంపిణీ చేసారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని కొండవారిపేటలో సర్వే నెం.66 లోని లేఅవుట్ నెం.1 లోని మూడు ఎకరాల ప్రభుత్వ పోరంబోకు స్థలంలో 60 మంది లబ్దిదార మహిళల్లో కొందరికి బుధవారం ఉదయం 11 గంటలకు ఎంపీడీవో. జే.రాంబాబు పట్టాలను లాంఛనంగా పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో సచివాలయం 1 కార్యదర్శి బులివీరన్న, వీఆర్వో యు.శ్రీనివాస రావు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గాయత్రి, సచివాలయం 2 కార్యదర్శి వీరబాబు, గౌతు నాగు, హౌసింగ్ సిబ్బంది, పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *