* జిల్లాకు చేరిన మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాలను తణికి చేసిన జేసి జి.లక్ష్మీశ

కాకినాడ , 07-01-2021.
———————————-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణి పధకంలో భాగంగా కాకినాడ జేఎన్టీయు గ్రౌండుకి చేరిన వాహనాలను గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి.లక్ష్మీశ, పౌరసరఫరాలు, రోడ్డు ట్రాన్స్ పొర్టు, లీగల్ మెట్రలాజి తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణి వ్యవస్తలో భాగంగా జిల్లాలో రేషన్ సరుకులు ఇంటి వద్దకే పంపిణి చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.ఇప్పటి వరకు 150 వాహనాలు జిల్లాకు చేరాయని, ఈ నెల 20 నాటికి మొత్తం వాహనాలు జిల్లాకు వస్తాయని జేసి తెలిపారు. చెక్ లిస్టులో ఉన్న 42 అంశాలను రెవెన్యూ, పౌరసరఫరాలు, రోడ్డ్ ట్రాన్స్ పొర్టు, పరిశ్రమల శాఖలకు చెందిన అధికారులు, మరొ చెక్ లిస్టులో ఉన్న 18 అంశాలను తూనికలు కొలతల అధికారులు క్షుణ్ణంగా తనిఖి చెయ్యాలని జేసి ఆదేశించారు. ఈ పరిశీలనలో జేసి వెంట కాకినాడ ఆర్డివో ఎజీ. చిన్ని కృష్ణ, డీయం సివిల్ సప్లయిస్ ఇ. లక్ష్మీ రెడ్డి,డీఎస్ఓ పి. ప్రసాదురావు, లీగల్ మెట్రలాజి అధికారి ఎమ్. మాధురి, ఆర్.టి.ఓ. ఆర్.సురేష్, ఆర్బన్ తహసిల్దార్ సతీష్ , టాటా మోటర్స్ కంపెనీ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *