* గ‌ట్టి సంక‌ల్పంతో పేద‌ల సొంతింటి క‌ల‌ను సాకారం చేస్తున్నారు
* రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు

కాకినాడ‌ – తూర్పుగోదావరి
—————————————
రాష్ట్ర వ్యాప్తంగా 25 ల‌క్ష‌ల ఇళ్లు ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాట ఇచ్చార‌ని, అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 30.75 ల‌క్ష‌ల ఇళ్ల స్థ‌లాలు, ఇళ్లు క‌ట్టించి ఇస్తున్నార‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార‌, మార్కెటింగ్ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు పేర్కొన్నారు. గురువారం సామ‌ర్ల‌కోట మండ‌లంలోని మాధ‌వ‌ప‌ట్నంలో 10 ఎక‌రాల 87 సెంట్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో 408 మంది ల‌బ్ధిదారుల‌కు ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ మ‌న‌సుంటే మార్గ‌ముంటుంది.. సంక‌ల్పముంటే నెర‌వేరు తుంది.. అని గ‌ట్టిగా న‌మ్మి ముఖ్య‌మంత్రి పేద‌ల సొంతింటి క‌ల‌ను సాకారం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. కేవ‌లం ప్ర‌భుత్వ భూమిలోనే కాకుండా వేల కోట్ల రూపాయ‌లు వెచ్చించి ప్రైవేటు భూముల‌ను కొనుగోలుచేసి లేఅవుట్ల‌ను అభివృద్ధి చేసిన‌ట్లు తెలిపారు. కాకినాడ గ్రామీణ నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 30 వేలు, పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గంలో 17 వేల ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాలు పంపిణీ చేస్తున్న‌ట్లు వివ‌రించారు. బైపాస్‌కు స‌మీపంలో మాధ‌వ‌ప‌ట్నంలో రూ.10 ల‌క్ష‌ల విలువ‌చేసే స్థ‌లాన్ని అక్కాచెల్లెమ్మ‌ల చెతుల్లో పెడుతున్న‌ట్లు తెలిపారు. ఎవ‌రిద‌గ్గ‌రికీ వెళ్లి చేయి చాచాల్సిన అవ‌స‌రం లేకుండానే పేద‌లకు సంక్షేమ ఫ‌లాలు అందుతున్నా య‌న్నారు. వలంటీర్‌, స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా కేవ‌లం అర్హ‌త ప్రాతిప‌దిక‌గా ల‌బ్ధిచేకూరుతోంద‌న్నారు. గ‌తంలో మాదిరి కులాల వారీగా కాల‌నీలు కాకుండా అంద‌రూ క‌లిసిమెలిసి ఒకేచోట ఉండేలా వైఎస్సార్ జ‌గ‌న‌న్న కాల‌నీలు అభివృద్ధి చెందుతున్నాయ‌ని వివ‌రించారు. ఈ కాల‌నీల్లో స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇళ్ల స్థ‌లాల‌ను మ‌హిళ‌ల పేరిట స‌ర్వ హ‌క్కుల‌తో రిజిస్ట్రేష‌న్ చేయించి ఇవ్వాల‌నేది ముఖ్య‌మంత్రి ఆకాంక్ష అని, కానీ, కొంద‌రు కోర్టులో కేసులు వేయ‌డంతో ఆ ప్ర‌క్రియ నిలిచింద‌న్నారు. మ‌రింత జాప్యం జ‌ర‌గ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో ప్ర‌స్తుతం ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాలను అందిస్తున్నామ‌ని, కోర్టు తీర్పు అనుకూలంగా వ‌చ్చాక రిజిస్ట్రేష‌న్ చేయించి ఇస్తామ‌ని వివ‌రించారు. క‌ష్టాన్ని గుర్తించ‌డం.. దాన్ని ఇష్టంగా ప‌రిష్క‌రించ‌డం ముఖ్య‌మంత్రి నైజ‌మ‌ని పేర్కొన్నారు. భ‌విష్య‌త్ త‌రాలను దృష్టిలో ఉంచుకొని ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాలు అందిస్తున్నార‌ని, వీటిని ఎవ‌రికీ ఎట్టి ప‌రిస్థితు ల్లోనూ అమ్ముకోవ‌ద్ద‌ని ల‌బ్ధిదారుల‌కు సూచించారు. కార్య‌క్ర‌మంలో కోఆర్డినేట‌ర్ ద‌వులూరి దొర‌బాబు, సామ‌ర్ల‌కోట మార్కెట్ క‌మిటీ ఛైర్మ‌న్ మేడిశెట్టి వీర‌భ‌ద్రం, బొందిలి కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్ తోట స‌త్తిబాబు, త‌హ‌సీల్దారు వ‌జ్ర‌పు జితేంద్ర, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు హాజ‌ర‌ు అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *