* ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్

శంఖవరం – తూర్పుగోదావరి
————————————–
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికీ సొంత ఇల్లు, స్థలం ఉచితంగా అందివ్వాలనేది ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ధృడ సంకల్పమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఆ దిశగా చేస్తున్న కృషిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల కుటుంబాలకు ఇల్లు, ఇళ్ళ స్థలాలను పంపిణీ చేస్తున్నా మన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం జి.కొత్తపల్లిలో ” నవరత్నాలు – పేదలందరికీ ఇండ్లు/ స్థల పట్టాల పంపిణీ / వైఎస్సార్ జగనన్న కాలనీ నిర్మాణం పధకం ” లో ఇళ్ళ స్ధల పట్టాలను పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. గొంధి కొత్తపల్లిలోని 131, అచ్చింపేటలోని 50, వి.వెంకటాపురంలోని 16 కుటుంబాలకు చొప్పున నివేశన స్థలాల పట్టాలను ఎమ్మెల్యే పంపిణీ చేసారు. ఈ సందర్భంగా జి.కొత్తపల్లి శివారున కొత్తగా తీర్చి దిద్దిన పట్టాలిచ్చే లేఅవుట్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడారు. ఒక్కో లబ్దిదార కుటుంబానికి సంటున్నర భూమినిస్తూ, ఇంటిని ప్రభుత్వమే రూ. 1.80 లక్షలతో నిర్మిస్తుందనీ, లబ్దిదారులు దానికి అదనంగా మరో రూ.3.80 లక్షలను జతచేసి మరింత సౌకర్యం వంతంగా నిర్మించు కోవచ్చన్నారు.

శంఖవరం – వేళంగి రోడ్డు పునర్నిర్మాణంనకు రూ. 6 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తి అయ్యింది. సంక్రాంతి అనంతరం నిర్మాణ పనులు ప్రారంభిస్తా మన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓటేసి జగన్ ను సిఎం. చేయాలని ఎమ్మెల్యే పిలుపు ఇచ్చారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులు అందరికీ ఒక్కో కుటుంబానికి దాదాపుగా రూ. లక్ష వరకూ కుటుంబ వ్యక్తిగత ప్రయోజనం లభిస్తోందన్నారు. అమ్మ ఒడి, ఆసరా తదితర సుమారు 45 ప్రభుత్వ పథకాలను కూలంకషంగా సభికులకు ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం, వీఆర్వో షేక్ బాబ్జీ, తూర్పు గోదావరి ఎస్సీ సెల్ కార్యదర్శి డాక్టర్ యడ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *