(జర్నలిస్టు మూర్తి)

* ఈవోని నియమించాలి

గొల్లప్రోలు – తూర్పుగోదావరి
——————————————
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజక వర్గం గొల్లప్రోలు పట్టణంలో పురాతన దేవాలయమైన విష్ణు ఆలయానికి సింగిల్ ట్రస్టీని రద్దు చేసి, ఈవోను నియమించాలని గొల్లప్రోలు పట్టణ ప్రజలు, ఆలయ భక్తులు కోరుతున్నారు. సుధీర్ఘ చరిత్ర కలిగిన దేవాలయానికి ఇప్పటి వరకు ఈవోను నియమించక పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి ఈవోను నియమించడం వల్ల భక్తులకు మరింత విస్తృతమైన సేవలు అందించడం సాధ్యం ఔతుంది అని మరి కొందరు అభిప్రాయపడ్డారు

పురాతన దేవాలయం ఆలయానికి రోజురోజుకీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. గతంతో పోలిస్తే రోజూ గుడికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటోంది. దీంతో ఆలయ పండితులు నిత్య పూజా కార్యక్రమాలు స్వామి వారికి నిర్వహించే సేవా కార్యక్రమాలు, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించే బాధ్యతతో పాటు ఆలయానికి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన ఇతర బయట పనులు కూడా ఆలయ పండితులు చెప్పడం వలన వారికి తలకు మించిన భారం అవుతుందని భక్తుల భావన. ఆలయానికి ఈవోను నియమించినట్లైతే పండితుల పై భారం తగ్గుతుందని అప్పుడు ఆలయ పూజారులు భక్తులకు భగవంతునికి మరిన్ని సేవలు అందజేయగలగు తారని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

రూ. ఆరు లక్షలు దాటిన ఆదాయం గొల్లప్రోలు పట్టణంలో ఉన్న విష్ణాలయం ఆదాయం ఆరు లక్షల పైమాటే… రెండు లక్షలు ఆదాయం దాటిన గుళ్ళకు ఈవోను నియమించడం పరిపాటి. ఆరు లక్షల ఆదాయం దాటిన ఇప్పటి వరకు ఈవోని నియమించక పోవడం ఏమిటని సందేహం వస్తుంది. గుడికి సంబంధించి భూమి, గుడి ముందు దుకాణాలు ఉన్నాయని దీనితో గుడికి సమృద్ధిగా ఆదాయం సమకూరుతుందని భక్తులు తెలిపారు. గుడిలో భక్తులకు అందించే సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి అంటూ భక్తులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా ఈవోను నియమించి భక్తులకు మరింత విస్తృతమైన సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *