– కాకినాడ ఎంపీ. వంగా గీత

* ఆస్పత్రులకు రూ.25 కోట్లు విడుదల
* ఇళ్ళకు రూ. 30 కోట్లు మంజూరు
* సీడీపీఓ.గైర్హాజరుపై ఎంపీ, ఎమ్మెల్యే ఆగ్రహం

శంఖవరం, జనవరి 10 (జనాసవార్త) ;
——————————————————– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న ఇళ్ళ స్థలాలు, పట్టాలు, గృహ నిర్మాణం పధకాలు అక్క చెల్లెమ్మల సొంతం… వీటీని అన్యాక్రాంతం చేయకండి అని కాకినాడ ఎంపీ. వంగా గీత హితవు పలికారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఇళ్ళ స్థలాలు, పట్టాలు పంపిణీకి కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ. వంగా గీత, ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ అతిథులుగా హాజరు అయ్యారు. తొలుత సభికులను ఉద్దేశించి ఎంపీ.
ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి సంక్షేమ పధకాల శకం ప్రారంభ మయ్యిందన్నారు. ఆ వరవడిలో వైఎస్సార్ నవశకం పధకం ప్రారంభమైందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలోనే మొదటిగా ప్రవేశ పెట్టారు. అలాగే విద్యార్థులకు ఫీజు రీత్యా ఎంబర్స్మెంట్ ప్రవేశ పెట్టిన ఘనత కూడా ఆయనే అన్నారు. ఆయన ఆశయాలకు వారసుడిగా దేశం మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సారిగా ఒకే రోజు 31 లక్షల మందికి స్థలాలను ఇచ్చిన ఓకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఒక్కరే …. ఒక్క సారిగా లక్షలాది మంది పేదలకు ఫింఛన్లను ఇచ్చిన ఘనత కూడా జగన్ దే అన్నారు. 14 ఏళ్ళు జనంలో పాదయాత్రతో ప్రజల కష్టాలను చూసిన నేత, మాటల నేత కాదు… చేతల నేత జగన్ అని ఎంపీ అన్నారు. కత్తిపూడి వాసులకు సుమారు 25 ఎకరాల భూమిని ఊరిని అనుకుని ఇవ్వడం కత్తిపూడి వాసుల అదృష్టం అన్నారు. ప్రభుత్వం ఇచ్చే స్థలం, ఇళ్ళ ఫధకంతో నిరుపేద కుటుంబాల అద్దె ఇళ్ళ ఇబ్బందులు తొలగిపోతా యన్నారు. ఇవి పట్టాలు మాత్రమే కాదు… ఆస్థి అని, భూములు పొందిన గృహ లక్ష్మిలు అందరూ భూమి లక్ష్మిల అయ్యారన్నారు. ఒక్కో స్థలం, ఇంటితో సుమారు రూ. 10 లక్షల సొత్తుకు మహిళలు యజమానులు కానున్నారు. దీన్ని సొంతం చేసుకోండి… పరులకు అన్యాక్రాంతం చెయ్యకండి అని ఎంపీ. హితవు పలికారు. నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి, నూతన ఆస్పత్రి భవనాల నిర్మాణానికి రూ.25 కోట్లను విడుదల చేయించడంతో పాటు కత్తిపూడికి నూతనంగా ఆస్పత్రి మంజూరుకు ఎమ్మెల్యే కృషి చేసారని ఎంపీ. గీత వెల్లడించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి పాలనను జగన్ అందిస్తున్నారు అన్నారు. తెలుగు దేశం పార్టీ ప్రజల పట్ల చూపిన నిర్లక్ష్య వైఖరి వల్ల నష్టపోయిన భాధితులైన ప్రజలను తన పాద యాత్రలో పరామర్శించిన జగన్ వారిని ఓదార్చారు … నాడే 25 లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తానని హామీ నిచ్చి ఇప్పుడు 35 లక్షల మందికి పట్టాలిచ్చారు అన్నారు. అందులో భాగంగానే ప్రత్తిపాడు నియోజకవర్గంలో 22,000 మందికి పట్టాలిచ్చాం అన్నారు. దీనిలో భాగంగానే కత్తిపూడిలో 1,100 మందికి రూ. 10 కోట్లతో సుమారు 40 ఎకరాల భూమిని, ఒక్కో ఎకరా భూమిని రూ. 40 లక్షలకు కొని పట్టాలను ఇస్తున్నా మన్నారు. పార్టీలు, వర్గాలు, మతాలకు అతీతంగా పట్టాలు, భూములు, ఇంటి నిర్మాణ పధకాలను ఇవ్వాలనేది ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి ఏకైక లక్ష్యాన్ని ప్రభుత్వం సాకారం చేస్తోంది అన్నారు. ఒక్కో ఇంటికి రూ. 1.80 లక్షల చొప్పున నియోజకవర్గంలోని మొత్తం ఇళ్ళకు రూ. 30 కోట్లు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే చెప్పారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తూ మీరు తీసుకున్న నిర్ణయమే మీ పేద ప్రజల అభివృద్ధికి నాంది అని ఎమ్మెల్యే అభివర్ణించారు.

సీడిపీఓ.గైర్హాజరుపై నేతల ఆగ్రహం
————————————————————–
ఈ కార్యక్రమంలో పక్కనే ఐసీడీఎస్. ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సీమంతాల కార్యక్రమానికి సీడీపీఓ. ఊర్మిళ, సూపర్వైజర్, మరి కొందరు మిగతా సిబ్బంది గైర్హాజరు కావడంపై ఎంపీ, ఎమ్మెల్యేలు మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి శాఖ కార్యక్రమానికి వారు గైర్హాజరు కావడం ఏంటని ప్రశ్నించారు. వైకాపా. జిల్లా ఎస్సీ సెల్ నాయకులు శెట్టిబత్తుల కుమార్ రాజా, గాబు కృష, గౌతు నాగు, గౌతు అర్జుబాబు, దడాల బాబ్జీ, తిరుపతిరావు మాట్లాడారు. కత్తిపూడి సచివాలయం 1 కార్యదర్శి కె.బులివీరన్న, వీఆర్వో యు. శ్రీనివాసరావు, సచివాలయం 2 కార్యదర్శి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *