white elephant gifts output signal coupon rogue creamery gift baskets black hills gold gifts free valentine gift tag printables

* ఆంధ్రాశబరిమల జ్యోతి దర్శన ఏర్పాట్లు పూర్తి

సిద్ధివారిపాలెం – తూర్పుగోదావరి
———————————————–
మకర జ్యోతి దర్శనం…. సకల పాప హరణం….
మణికంఠుడి మకర జ్యోతి దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం గౌరంపేట శివారు సిద్ధివారిపాలెంలోని ఆంధ్రా ప్రసిద్ది పొందిన ఆంధ్రా శబరిమల మణికంఠుడి ఆలయంలో స్వామి దర్శనానికి భక్త జనం ఈ ఆంధ్రా శబరిమలకు క్యూ కడతారు. మాల ధారణ చేసిన భక్తులు అందరూ రాష్ట్రం నలు మూలల నుంచి సిద్ధివారిపాలెంనకు పరుగులు పెడతారు. స్వామి వారి మండల పూజులు పూర్తి చేసుకున్న భక్త స్వాములు అయ్యప్ప దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. సాధారణంగా అయ్యప్ప మకర జ్యోతి ఎప్పుడూ మకర సంక్రాంతి రోజునే ప్రత్యక్షం అవుతుంది.

మకర సంక్రాంతి ఎప్పుడు వస్తుందనే విషయంలో ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క విధంగా గంటల వ్యవధిలో నిర్ణయిస్తారు. ఎక్కువ సార్లు జనవరి 14న మకర సంక్రాంతి వస్తుంది. ఈ పర్యాయం కూడా జనవరి 14న ఉదయం 8.30 గంటల నుంచి ఉదయం 10.22 గంటల వరకూ మకర సంక్రాంతి మహా పుణ్య కాలం ఉంది. అంటే మొత్తం 1గంట 52 నిమిషాలు ఉంటుంది. ఈ సమయంలో చేసే పనులు అత్యంత ఎక్కువ సత్ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ పర్వదినాన ఈ ఆంధ్రా శబరిమల   శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర జ్యోతి దర్శనానికి అత్యంత కన్నుల పండుగగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం సమీపంలో తూర్పు దిక్కున ఉన్న తూర్పు కనుమలలో సాయంత్రం 6.40 గంటల తర్వాత ఇక్కడ అయ్యప్ప స్వామి మకర జ్యోతి రూపంలో దర్శనమిస్తారు. ఈ దర్శనమిచ్చే ఆధ్యాత్మిక ఘట్టాన్ని తిలకించేందుకు అయ్యప్ప మాలలు ధరించిన స్వాములు ఈ ఆంధ్రా శబరిమలకు పెద్ద ఎత్తున చేరుకుంటారు. స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మార్మోగుతాయి. ఆ దృశ్యం చూడటానికి రెండు కన్నులూ చాలవనిపి స్తుంది. మకర జ్యోతి రూపంలో దర్శనమిచ్చే మణి కంఠుడిని చూసి తరించడానికి రెండు రోజుల నుంచి భక్తులు ఇక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకుంటారు.

వీరి సౌకర్యం కోసం శంఖవరం నుంచి సిద్ధివారిపాలెం వరకూ 12 కిలోమీటర్ల దూరం పొడవునా ఉచిత రవాణా సౌకర్యంగా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసారు. ఈ వాహనాల్లో తాగుబోతు నీటిని అందుబాటులో ఉంచే ఏర్పాటు చేసారు. ఆలయానికి చేరుకున్న భక్తులకు ఉచిత ప్రసాద వితరణతోపాటు ఉదయం పులిహోర, ఉప్మా వంటి ఉపాహారం, మధ్యాహ్నం సాత్వికాహారం అందించే సహపంక్తి అన్న ప్రసాద సమారాధన సౌలభ్యం ఇక్కడ భక్తుల సొంతం. మకరజ్యోతి దర్శనం చేసు కోవడాన్ని వేయి జన్మల పుణ్య ఫలంగా భక్తులు భావిస్తారు. భక్తుల మనో భావాలకు తగినట్లుగా ఏ లోటుపాట్లు లేకుండా స్వామిని దిగ్విజయంగా దర్శించు కునేందుకు తన వ్యవస్థాపక నిర్వహణా  సారధ్యంలోని ఆంధ్రా శబరిమలలో ఈ ఏడాది కూడా దాదాపు అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు ఆలయ ధర్మకర్త, భూపతి కుసుమంచి శ్రీసత్యశ్రీనివాసరావు “మనం న్యూస్” కు ఆదివారం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *