theatre ticket gifts london el pollo loco grilled chicken salad coupon the greatest gift of all jim brickman mp3 lyft chicago coupon

నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ 2021 లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసిన ‘టక్ జగదీష్’ ఫస్టు లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటిస్తూ నానిని ఇంతకు ముందెన్నడు చూడనంత క్లాస్ గా సరికొత్త పోస్టర్ని విడుదల చేశారు. కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్ళి కొడుకుగా రెడి అవుతున్న నాని లుక్ ఆకట్టు కుంటున్నది. ‘టక్ జగదీష్’ ఏప్రిల్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండగ ఏప్రిల్ 13. పండగ మూడు రోజుల ముందు ‘ టక్ జగదీష్ ‘ థియేటర్లకు రావడంతో మళ్లీ సెలబ్రేషన్స్ మొదలు కానున్నాయి. రీతూవర్మ, ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *