(ఆర్టీఐ. ఉద్యమ నేత సోమిరెడ్డి రాజు)

ఎస్.రాయవరం – విశాఖ జిల్లా
——————————————
పాఠశాల అదనపు భవనం గోడలను గ్రామ వైఎస్సార్ పార్టీ నాయకుడు పిట్ల నాయుడు ద్వంసం చేసి తన ట్రాక్టర్లకు పార్కింగుగాను, తన పశువులును ఈ భవనాలలో కట్టుకుంటూ పశువులశాలగా మార్చి వాడుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చినా మండల అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరించడం పై పలు విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

నేటి బాలలే రేపటి పౌరులుగా పిలువబడే వీరు, ఆధునిక దేవాలయాలుగా పిలవబడే పాఠశాల భవనాలలో కాక వరండాలలోను, పశువుల శాలలుగాను, ట్రాక్టర్లు నిలుపు పార్కింగ్ స్థలాల ప్రక్కన విద్యాబ్యాసం చేసి వీరు ఏవిధంగా ప్రయోజకులుగా తయారవుతారో నాయకులు, అధికారులు తెలపవలసి ఉన్నది. ప్రజలకు సేవ చేయడానికే వచ్చామని తెలుపుతూ నాయకుడుగా చెలామణీ అవున్నా, అన్నీ వదిలేసిన మాకు సిగ్గేమిటి, బడి, గుడి, చెరువులు ఏమైనా మా స్వార్దానికి అక్రమిస్తున్న నాయకుల చర్యలనపై ప్రజాసేవకే ఉన్నామన్న మండల అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వీరి ఆగడాలకు అడ్డులేకుoడా పోతున్నది. గతంలో నేవీ నుంచి ప్యాకేజి పొందడానికి, వివాహం కాని తన కుమారుడుకు వివాహం అయినట్లు సినీ హీరోయిన్ తో ఫొటో పెట్టి రేషన్ కార్డు పొందిన ఘన చరిత్ర వీరిది.

ఇసుక, మట్టిని అక్రమంగా అమ్మడం, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు వంటి వీరి ఆగడాలను అడిగిన వారిపై దాడి చేయడం వీరికి సర్వ సాధారణం. దేవుళ్ళతో సమానమని భావించే పిల్లలకు, గురువులైన ఉపాధ్యాయులును ‘గురు బ్రమ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర’గా కొలిచే వీరికి ఈ దుస్థితి కలిగించడం, సభ్య సమాజం తలదించుకొనే ఇటువంటి సంఘటనలు కొనసాగించడం చిగ్గుచేటు. గతంలో నిర్మించిన గదిలో పాఠశాల తరగతులు, కార్యాలయాకి ప్రధాన ఉపాధ్యాయురాలు టి.బంగారమ్మ ఉపయోగించు కుంటుండగా, వరండాలో మరో ఉపాధ్యాయుడు శివ కృష్ణ ఉన్న అరకొర సదుపాయాలతో, నాయుడు అక్రమించుకోగా మిగిలిన భాగంలో విద్యాబోధన చేస్తున్నారు.

ఈ పాఠశాలలో 28 మంది బాలురు,20 మంది బాలికలు మొత్తం 48 మంది ఉన్నారు. వర్షాలకు కారుతున్న వంటశాలలో జి. సత్యవతి వంటలు నిర్వహిస్తున్నది. ఉన్న రెండు బాత్రూంలను బాలురు ఒకటి, రెండవది బాలికలు, ఉపాధ్యాయులు ఉపయోగిస్తున్నారు. నాడు-నేడు కార్యక్రమంలో పాఠశాలలను ఆధునిక దేవాలయాలుగా మార్చలన్న ప్రభుత్వ ఆశయానికి తమ పార్టీ నాయకులుగా చెప్పుకొనే వీరే గండి కొట్టం విషేశం.పాఠశాలకు ఆనుకొని ఉన్న రోడ్డుకు అవతలవున్న తన ఇంటికి, పాఠశాలకు ఏర్పాటు చేసిన త్రాగునీటి కుళాయికు పైపు తగిలించుకొని సొంతానికి వాడుకుంటున్న ఇటువంటి వ్యక్తులకు ఏశిక్ష వేసినా తక్కువే అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ప్రధానోపాధ్యాయురాలు 2017 లో ఈ పాఠశాలలో చేరగా 2018 నుంచి పిట్ల నాయుడు పాఠశాలను ఆక్రమించినట్లు తెలుస్తున్నది. ఎవరైనా అడిగితే భవన నిర్మాణం తాను చేపట్టినoదున, తనకు ఇంకా కొద్ది మొత్తం బిల్లు బకాయి రావలసి ఉన్నందున నా ఇష్టం అని ఎదురు సమాధానం తెలుపుతున్నట్టు తెలుస్తున్నది. పాఠశాల కమిటీ చైర్మన్ జి.గోవిందరావు కు, మండల విద్యాధికారి ఎ.ఎన్.యస్.ఎ.ఎన్.మూర్తి, ఎం.పి.డి.ఓ చంద్రశేఖర్ కు ఫిర్యాదులు అంది, పరిశీలించి చర్యలు తీసుకోక మిన్నకుండడంలో ఉన్న అంతరార్థం ఏమిటో గ్రామస్తులకు సమాధానం చెప్పాల్సి ఉన్నది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి, విచారణ చేసి నాయుడు పైన, సంబంధిత అధికారులపైన చట్టప్రకారం చర్యలు తీసుకొని, ఇప్పటికైనా న్యాయం చేస్తారని సమాచార హక్కు చట్ట కార్యకర్త సోమిరెడ్డి రాజు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *