శంఖవరం – తూర్పు గోదావరి

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం మండల కేంద్రమైన శంఖవరం అంబేద్కర్ నగర్లో జై భీమ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులను అందజేశారు. ముగ్గుల పోటీలతోపాటు కుర్చీలాట, తాడాట, లెమన్ స్పూన్ వంటి ఆటల పోటీలను నిర్వహించారు. పోటిల్లో ప్రతిభ కనపరచిన ప్రధమ విజేత నేతల ఆశీర్వాదం, రెండో విజేత పులగల అనిత, మూడో విజేత కొంకిపూడి సత్యవేణిలకు బహుమతులను అతిథులు, స్ధానిక చర్చ్ సంఘ కాపరి దంపతులు స్టీఫెన్, ఆయన సతీమణి శాంతికూమరి అందజేశారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బందిలి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు శీకోలు నాగు, కార్యదర్శి పులి కిషోర్, సంయుక్త కార్యదర్శి కోంగు రమేష్, కోశాధికారి బందిలి శీను, చెవల రాజా, బోడపాటి రమణ, పులి రవిశంకర్, కోంగు శీను తదితర యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *