శంఖవరం – తూర్పుగోదావరి
——————————————
ఇటీవల కాలంలో మానవాళిని పెద్ద ఎత్తున మట్టు బెట్టిన మహమ్మారి కరోనా వ్యాధి నివారణా
సామూహిక టీకా శిబిరాన్ని ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండల కేంద్రమైన శంఖవరంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కార్యక్రమ డివిజన్ ఇన్ఛార్జి రవికుమార్ పర్యవేక్షణలో శనివారం ప్రత్యేకంగా ఈ టీకా శిబిరాన్ని ఏర్పాటు చేసారు. తొలి టీకాను ఆస్పత్రి ప్రధాన వైద్యుడు ఆర్వీవీ. సత్యనారాయణకు ఎమ్మెల్యే సమక్షంలో ఆస్పత్రి సీనియర్ ఏఎన్ఎం.గ్లోరి వేసారు. అనంతరం ఆస్పత్రి సిబ్బంది, క్షేత్ర స్థాయి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకు కోవీషీల్డ్ టీకాలను వేసారు. అనంతరం మీడియాకు కార్యక్రమ వివరాలను ఆస్పత్రి ప్రధాన వైద్యుడు ఆర్వీవీ.సత్యనారాయణ వెల్లడించారు. మొదటి రోజు మొదటి దఫాగా ఫ్రంట్ లైన్ వారియర్స్ ఐన ఆస్పత్రి సిబ్బంది 100 మందికి ఈ టీకాలు వేస్తున్నా మన్నారు. 500 డోసుల టీకాలను ప్రభుత్వం ఆస్పత్రికి సరఫరా చేసిందని, రోజుకు 100 మందికి చొప్పున ఐదు రోజులు పాటు ఈ టీకాలను వేస్తామని వైద్యుడు సత్యనారాయణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ మండల కమిటీ చైర్మన్, తాసిల్దారు కర్నాసుల సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులైన ఎంపీడీవో. జే. రాంబాబు, ఐసీడిఎస్.పీ.ఓ. ఊర్మిళ, స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు బాలాజీ, సూర్యారావు, పెదమల్లాపురం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు లలితారాణి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు కోగూరి నాగమణి, జక్కల సూర్యకాంతం, గుండె సునీత, లక్ష్మి, విజయ, నూకరత్నం, రత్నకుమారి, నాగలక్ష్మి ఇంకా పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *