* సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే
* బాధితులను కలెక్టర్ వద్దకు తీసుకెళ్ళి న్యాయం
చేస్తానని ఎమ్మెల్యే హామీ

యస్.రాయవరం – విశాఖ జిల్లా
————————————————-
విశాఖ పట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గం యస్.రాయవరం మండలం రెవెన్యూ అధికార యంత్రాంగం అవినీతిని బాధితులు బట్టబయలు చేసారు. మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలోని రెవిన్యూ అధికారుల తీరు, అవినీతి, అక్రమాలు, చేతి వాటం వలన తమ భూములను కోల్పోయిన 10 కుటుంబాల రైతులూ సామూహికంగా ఐక్యతతో వెళ్ళి కోరుప్రోలులోని ఎమ్మెల్యే స్వగృహంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావును ఆయన స్వగృహంలో 10 బాధిత కుటుంబాల సభ్యులు అందరూ ఆదివారం స్వయంగా కలిసారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు తమ గోడును వెళ్ళబోసు కున్నారు. తమ భూములను నిజమైన యజమానులు తామే అయినప్పటికీ, అన్ని యాజమాన్య హక్కు పత్రాలు తమ్ముడూ పేరునే ఉన్నప్పటికీ, అక్రమార్కులతో రెవిన్యూ అధికారులు కుమ్మకై తప్పుడు పత్రాలను సృష్టించి లక్షలాది రూపాయల విలువైన తమ భూములను అక్రమార్కుల పేరున రెవిన్యూ రికార్డులలో నమోదు చేసి, పాస్ బుక్స్ మంజూరు చేసి లక్షల రూపాయల విలువైన తమ భూములను పరాయి వారికి దారాదత్తం చేయడానికి రెవిన్యూ అధికారులు ప్రయత్నo చేస్తున్నారు అని ఎమ్మెల్యేకు వివరించారు. అన్యాయమై పోయిన తాము తమ రికార్డులను పట్టుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ సంవత్సరాల తరబడి యస్.రాయవరం, తాహశీల్దార్, నర్సీపట్నం సబ్ కలెక్టర్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమకు అన్యాయం జరిగిందని వేడుకున్నా తమకు న్యాయం జరగ లేదని ఎమ్మెల్యేకు వివరించారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. వారి సమస్యలను సాంతం విన్న ఎమ్మెల్యే గొల్ల బాబూరావు బాధితులకు ప్రతీ కుటుంబం తమకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా 3 రోజుల అనంతరం వ్రాత పూర్వకంగా తన వద్దకు వచ్చి అందజేయాలని సూచించారు. ఆరోజు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని బాధితులు అందరినీ కలెక్టర్ వద్దకు తీసుకొని వెళ్లి న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇవ్వడంతో భాదితులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలియ జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *