శంఖవరం – జనాస వార్త
————————————
ఈ మధ్య వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీకి వ్యతిరేఖంగా గళమెత్తిన వినియోగ దారులను విపరీతంగా ఆకర్షించిన సిగ్నల్ యాప్‌కి “సిగ్నల్” లేదు. ఈ యాప్ వినియోగంలో ప్రధమంలోనే అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ యాప్ పై వినియోగదారులకు ఏర్పడిన మోజు కాస్తా తగ్గిపోయింది. ఇటీవల కాలంలో
వాట్సాప్ కొత్త సర్వీస్ రూల్స్ యూజర్లకు నచ్చట్లేదు. వాట్సాప్ కొత్త నిబంధనల నోటిఫికేషన్లను కస్టమర్లకు పంపించింది. వాటిని ఒప్పుకుంటేనే వాట్సాప్ వాడాలని మెలిక పెట్టింది. వాటిపై చాలా మంది కస్టమర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్, అమెరికన్ విజిల్‌బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్, ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే వంటి ప్రముఖులు సిగ్నల్ యాప్‌ను వాడమని చెప్పేశారు. దాంతో అంతా సిగ్నల్ యాప్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. తమ ప్రైవసీకి దెబ్బ పడుతుందని ఆలోచిస్తూ వాట్సాప్‌ని వదిలేసి సిగ్నల్ యాప్‌కి జంప్ అవుతున్నారు. యాపిల్ ఇండియా యాప్ స్టోర్‌లో ఇది నంబర్ వన్ యాప్‌గా మారింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఇప్పటికే కోటి మందికి పైగా పైగా ఈ యాప్ వాడుతూ ఉన్నారు. ఈ యాప్ కు 5.4 రేటింగ్ ను కూడా ఇచ్చారు. ఇండియాలో సిగ్నల్ యాప్‌కు క్రేజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. ఎవరి నోట చూసినా ఇదే మాట.
యాపిల్ యాప్‌స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో సిగ్నల్ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 9.0 ఐఓఎస్ పద్దతిలో ఆ తరువాత వచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే యాపిల్ డివైజ్, ఆండ్రాయిడ్ 4, ఆ తరువాత వచ్చిన అప్డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండే ఆండ్రాయిడ్ డివైజ్‌లలో సిగ్నల్ యాప్ పనిచేస్తుందని పెద్ద ప్రచారమే జరిగింది. ఐతే వాస్తవానికి సిగ్నల్ యాప్ వినియోగంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఇది సరిగా పని చేయడం లేదు. వినియోగదారులు అసంతృప్తికి గురయ్యారు. దీంతో మళ్ళీ వాట్సాప్ కు పరుగులు తీస్తున్నారు. సిగ్నల్ యాప్‌కి “సిగ్నల్” లేదు అంటూ తాజాగా వ్యాఖ్యానిస్తున్నారు. సిగ్నల్ యాప్ యాజమాన్యం మాత్రం సాంకేతిక లోపాలను సరిదిద్ది సేవలను మెరుగు పరుస్తామని ప్రకటించింది.