* మార్చి 31కి కాలువలకు గోదావరి జలాలు నిలుపుదల
* నీటి పారుదల , త్రాగునీటి సరఫరా, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలి * నీటి పారుదల ద్వారా రూ. 4.43 కోట్లతో 37 క్రాస్ బండ్ పనులు
* ఫిబ్రవరి 15 నాటికి అన్ని త్రాగు నీటి రిజర్వాయర్లు 100 శాతం నింపాలి
* రైతులకు అవగాహనకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేయాలి
* జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా వున్న నీటిని పొదుపుగా వినియోగించుకోనే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి .
* కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి దిశానిర్దేశం

కాకినాడ – తూర్పుగోదావరి
—————————————
పోలవరం నిర్మాణపు పనులు దృష్ట్యా మార్చి 31 నుండి జిల్లాలోని సాగు, త్రాగు నీటి కాలువలకు గోదావరి జలాలను విడుదలను నిలిపి వేయడం జరుగుతుందని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కలెక్టర్ తన కార్యాలయపు సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ తో కలిసి ఇరి గేషన్, త్రాగునీరు, వ్యవసాయశాఖ అధికారులతో ఇటివల ఇరిగేషన్ ఎడ్వయిజరీ బోర్డు సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వేగవంతంగా పోలవరం నిర్మాణాల పనులు చేపడుతుందనీ, పనులకు ఆటంకం జరగ కూడదని ఉద్దేశ్యంతో జిల్లాలో కాలువలకు నీటి సరఫరా నిలుపుదల చేస్తున్నా మన్నారు. ఆ సమయంలో జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా నీటిని పొదుపుగా వినియోగించుకోనే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో తరచుగా పర్యటించి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వుండాలని, జిల్లా మంత్రులతో పాటు స్థానిక శాసన సభ్యులతో చర్చించి తీసుకోవలసిన అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇరిగేషన్ ద్వారా 4.43 కోట్ల రూపాయలతో 37 క్రాస్ బండ్ నిర్మాణపు పనులు తక్షణ చేపట్టి పనులు పూర్తి చేయాలని ఇరి గేషన్ ఇంజనీర్లుకు ఆదేశించారు. వీటికి కావలసిన అనుమతుల పై ఎటువంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన నిర్ణయాలు చేపట్టాలన్నారు. అదే విధంగా జిల్లాలోని అన్ని త్రాగు నీటి రిజర్వాయర్లను ఫిబ్రవరిం 15 నాటికి నింపాలని త్రాగునీటి సరఫరా ఇంజనీర్లకు ఆదేశించారు. వీటికి కావలసిన మరమత్తుల పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. ఇరిగేషన్ ఎడ్వాయిజరి బోర్డు సమావేశంలో 2020 డిశంబరు 31 నాటికి నాట్లు వేసుకొనే విధంగా నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం నాట్లు వేయని వారువుంటే స్వల కాలిక పంటలు వేసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో దండోరా వేయించి రైతుల్లో అవగాహన కల్పించి వారినుండి లిఖిత పూర్వకంగా సమాచారం సేకరించాలని వ్యవసాయశాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రైతు భరోసా కేంద్రాలా పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. ముఖ్యంగా సెంట్రల్ డెల్టా విషయంలో అప్రమత్తంగా వుండి అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నీటి నిల్వల నిర్వహణకు అవసరమైతే క్షేత్ర స్థాయిలో అనుభవం వున్న ఇరి గేషన్ ఇంజనీర్లు సేవలు వినియోగించు కోవాలని రైతుల నుండి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదనీ కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. నీటి నిలుపుదల అంశం చాలా సున్నిత మైనందున తదనుగుణంగా వ్యవసాయం, నీటి పారుదల, త్రాగునీటి శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా వుండి జరుగతున్న పనులను పర్యవేక్షిస్తూ ఎడ్వాయిజరి బోర్డు తీసుకొన్న నిర్ణయాలను అమలు జరపాలని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులకు దిశ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్.ఇఆర్. శ్రీరామకృష్ణ, త్రాగునీటి సరఫరా ఎస్.ఇటి. గాయిత్రిదేవి, వ్యవసాయశాఖ జెడి కెఎస్వీ ప్రసాద్, సంబంధిత శాఖ ఇఇలు, డిఇలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *