శంఖవరం – తూర్పుగోదావరి
—————————————–
ఆంధ్రా శబరిమలకు ఆధ్యాత్మిక చింతనా పరులు విరాళాలు సమర్పించి సహృదయంతో సహకరించాలని ఆలయ ధర్మకర్త, భూపతి, డాక్టర్ కుసుమంచి శ్రీసత్యశ్రీనివాసరావు గురుస్వామి ఓ ప్రకటనలో కోరారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరానికి చేరువలో కత్తిపూడి నుండి శంఖవరం సమీపంలో పెదమల్లాపురం పంచాయితీ శివారు సిద్దివారిపాలెంలో 10 కొండలు మధ్య నిర్మించిన ఆంధ్రాశబరిమలలో త్వరలో చేపట్టబోయే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మహా కుంభాభిషేకాల నిర్వహణ, ఆలయ అభివృద్ధికి భక్తులు తమ విరాళాలను ఇచ్చి సహకరించాలని ఆయన పేర్కొన్నారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్క భక్తుడూ రోజుకి రూ. 10 / – చొప్పున నెలకు రూ . 300 / – చొప్పున 18 నెలల పాటు సహకరించమని శ్రీనివాసరావు కోరారు. ప్రతి నెల 18 వ తారీఖు నాటికి ఈ విరాళాలను ఆంద్రా శబరిమలై ట్రస్ట్ ఆంధ్రా బ్యాంక్ ఎకౌంట్ నెం. 100510100019860కు విరాళాలు పంపాలని ఆయన కోరారు. అయ్యప్పకు 18 సంఖ్య అంటే ఇష్టం కాబట్టి ప్రతి నెల 18 వ తారీఖు అని, 18 నెలలు అని, ఎంతో మంది గురు స్వాములు అందరూ నిర్ణయించారని అన్నారు. సంవత్సరం పొడవునా ప్రతి నిత్యము అయ్యప్ప స్వామి దర్శనం, నిత్యం అభిషేకం ఉంటుందని, రాత్రి పగలు ఎప్పుడైనా రావచ్చని, స్త్రీలు కూడా రావచ్చని ఆయన ఆంధ్రాశబరిమలకు శుభ స్వాగతం పలికారు. తాము నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక సేవా పరంపరలో లోటుపాట్లు, సలహాలు, సూచనలను 9397925007, 7075011018 తెలియ జేయమని ఆంధ్రా శబరిమల భక్తులను ఆలయ ధర్మకర్త, భూపతి, డాక్టర్ కుసుమంచి శ్రీసత్యశ్రీనివాసరావు గురు స్వామి ఆ ప్రకటనలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *