శంఖవరం – తూర్పుగోదావరి
—————————————–
తూర్పు గోదావరి జిల్లా శంఖవరం ఐసీడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలకు, సచివాలయం మహిళా కార్యదర్శినీలకు (మహిళా పోలీస్) ఈ  22 తేదీ వరకూ శిక్షణా కార్యక్రమాల నిర్వహిస్తామని పధకం అధికారిణి ఊర్మిళ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఐదు రోజుల పాటు అంగన్వాడీ ప్రి ప్రైమరీ స్కూల్ నిర్వహణపై సూపర్వైజర్ల పర్యవేక్షణలో ఈ శిక్షణ ఇస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రి ప్రైమరీ స్కూల్స్ గా ప్రభుత్వం మార్చినందున ఈ శిక్షణా కార్యక్రమాలన నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రి ప్రైమరీ పాఠశాల పిల్లలకు ప్రి ప్రైమరీ 1 & ప్రైమరీ 2 గా సిలబస్ ఉంటుంది. పిల్లలకు ఉపయోగపడే ఆటపాఠలు , కథలు, మంచి అలవాట్లు, వర్క్ బుక్స్, స్పోకెన్ ఇంగ్లీష్, రిమోట్ లెర్నింగ్, స్కూల్ సంసిద్దత తదితర అంశాలపై ఈ శిక్షణను ఇస్తామని శంఖవరం ఐసీడిఎస్.పీఓ. ఊర్మిళ ఆ ప్రకటనలో వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *