శంఖవరం – తూర్పు గోదావరి
——————————————-
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండల కేంద్రమైన శంఖవరంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రెండో దఫాగా మంగళవారం కూడా కరోనా నివారణ టీకాలను వేసారు. శంఖవరంలోని సమగ్ర శిశు, మహిళా అభివృద్ధి సంస్థ పరిధిలోని శంఖవరం, రౌతులపూడి మండలాలకు చెందిన 60 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు నేడు ఈ టీకాలను వేసారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఆర్వీవీ.సత్యనారాయణ, బాలాజీ, సూర్యారావు, ఫార్మసిస్ట్ రమణకుమారి, స్టాఫ్ నర్సులు దాసరి ప్రశాంత కుమారి, దుర్గాదేవి, సీహెచ్ఓ.కృష్ణకుమారి, హెచ్వీ. వీరలక్ష్మి, ఏఎన్ఎం. అనురాధ, సూర్యకుమారి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు జక్కల సూర్యకాంతం, విజయ, ఇంకా పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *