* ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్
* ఎన్నికలు వద్దన్న ఆంధ్రప్రదేశ్ సర్కార్
* హైకోర్టు డివిజన్ బెంచ్ లో ముగిసిన వాదనలు

అమరావతి – జనాసవార్త
————————————–
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిసింది. అటు ప్రభుత్వం, ఇటు ఎస్ఈసీ తరపు వాద నలు విన్న న్యాయస్థానం
తీర్పును రిజర్వ్ చేసింది. ఎఈసీ పిటిషన్ పై ప్రతివాదిగా చేరేందుకు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల తరపున దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిన తర్వాత అందులో జోక్యానికి తావు లేదని ఎఈసీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్. కరోనా వ్యాక్సినేషన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలను ఎన్నికల కమిషనర్ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకే సమయంలో నిర్వహించడం సాధ్యం కాదన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు పెద్ద యుద్ధమే జరుగుతోంది. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అసాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పగా, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మాత్రం ఫిబ్రవరిలో ఎన్ని కలు నిర్వహిస్తామని షెడ్యూల్ కూడా విడుదల చేశారు. దీంతో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేయడంతో న్యాయస్థానం దాన్ని కొట్టి పారేసింది. ఆ తీర్పుతో ప్రభుత్వానిదే పైచేయిగా మారింది. అయితే సింగిల్ బెంచ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ లో నిమ్మగడ్డ సవాల్ చేశారు. కాగా తాజాగా డివిజన్ బెంచ్ తన తీర్పును రిజర్వ్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *