* విమర్శలు వెల్లువ

యస్.రాయవరం – విశాఖ జిల్లా
————————————————-
శిలాఫలకంపై అనర్హుల పేర్లను ఇష్టారీతిన వ్రాసుకొని ఆవిష్కరణ చేయడం వివాదాస్పదం కావడం తెలుగు దేశం పార్టీ హయాంలో చూశాం … అవినీతి రహిత సమాజం నిర్మాణం, పారదర్శక పాలన అంటూ గొంతు చించు కుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ అదే ఒరవడి కొనసాగిస్తున్నారు…. షేమ్ టూ షేమ్ … 

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గం యస్.రాయవరం మండలంలో ఇటీవల జగనన్న పేదలందరికీ ఇళ్ళ స్థల పట్టాలు పంపిణీ, గృహ నిర్మాణ శంకుస్థాపనకు వినియోగించిన శిలాఫలకంపై పేర్లలో ప్రొటోకాల్ ఉల్లంఘనపై పలు విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి పదవీ లేని వ్యక్తుల పేర్లు శిలాఫలకంపై వేయడం ద్వారా ప్రోటోకాల్ పట్టించుకొక పోవడం పట్ల, శిలాఫలకంనకు ఉన్న గౌరవంను దిగజార్చారని రాష్ట్ర ప్రభుత్వoపై పలు వ్యాఖ్యానాలు ఇక్కడ వినిపిస్తున్నాయి. గతంలో యస్.రాయవరం శివారు అగ్రహారంలో నిర్మించిన సామాజిక భవనంనకు బొలిశెట్టి గోవిందరావు, కొణతాల శ్రీనివాసరావు ఇదే విధంగా ఏర్పాటు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు మళ్లీ పట్టాలు పంపిణీ శిలాఫలకంపై కొణతాల ఉమా శ్రీనివాసరావు, బొలిశెట్టి గోవిందరావు, లక్కోజు ఆదిమూర్తి పేర్లు పెట్టడంతో విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఈ విషయంపై తాహశీల్ధార్ బి.సత్యనారాయణ, ఎం.పి.డి.ఓ.చంద్రశేఖర్ ఈ విషయమై వివరణ ఇస్తూ ప్రోటోకాల్ విస్మరించి అనర్హుల పేర్లు శిలాఫలకంలో లిఖించడం నిబంధనలకు విరుద్ధమని ఈ విషయాలు హౌసింగ్ అదికారులు చూసుకున్నారని తెలిపారు. ఈ విషయమై మండల హౌసింగ్ అధికారిని వివరణ అడుగగా శిలాఫలకాన్ని అధికార పార్టీ నాయకులు తయారు చేయించుకొని ఏర్పాటు చేసుకున్నారని భాద్యతా రాహిత్యంగా సమాధానం చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా శిలాఫలకంలో పేర్లను పేర్కొన్న సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని, తప్పులు సరిచేసి తిరిగి సరియైన పేర్లతో సరికొత్త శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలని యస్.రాయవరం మండలం యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్.టి.ఐ. కన్వీనర్ సోమిరెడ్డి రాజు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *