ఎస్.రాయవరం – విశాఖ జిల్లా
—————————————–
విశాఖపట్నం జిల్లా యస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామ కాపురస్తుడు మైలపల్లి శ్రీను తన ట్రాక్టర్ AP 31 DE 8302 తో బంగారమ్మపాలెం బీచ్ నుండి ఇసుక అక్రమoగా రోజూ తరలిస్తూ ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఇసుక కొరతను ఆసరాగా చేసుకుని వరహానది ఇసుకగా తెలుపుతూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని సార్లు వరహానది ఇసుక, బీచ్ ఇసుక కలిపి కల్తీ చేసి అమ్ముతున్నాడు. సముద్రపు ఇసుక గరుకు తనంతో, జీవంతో నాణ్యతతో ఉంటుంది. అదే సముద్రపు ఇసుక ఐతే గరుకుదనం లేకుండా మెత్తని పిండిలా ఉప్పు నీటితో జీవం కోల్పోయి నాసిరకంగా ఉంటుంది. ఈ రెండింటినీ మిశ్రమం చేసి స్వలాభం కోసం ఈ నాసిరకం ఇసుకను అమ్మి కొనుగోలు దారులను మోసం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కన్వీనర్ యునైటెడ్ ఫారం ఫర్ ఆర్టీఐ, యస్.రాయవరం సోమిరెడ్డి రాజు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *