“తనకు, తన కుటుంబంనకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ తేతలి విజయలక్ష్మి విడుదల చేసిన బహిరంగ లేఖ పూర్తి పాఠం….”

అనపర్తి – తూర్పుగోదావరి
————————————–
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నకు చేందిన తేతలి విజయలక్ష్మి అను నా కుటుంబంలో నెలకొన్న విభేదాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటూ నా సొంత తమ్ముడు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మా మరదలు మహాలక్ష్మి, మా మామయ్య బూసిరెడ్డితోపాటు నాపై కూడా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. విభేదాల కారణంగా నా భర్త సత్తిరాజురెడ్డి, నేను వేరువేరుగా ఉంటున్నాము. కానీ విడాకులు తీసుకోలేదు. ది.18.01.2021న నా భర్త సత్తిరాజురెడ్డి బిక్కవోలు, బలభద్రపురము గ్రామముల మధ్య కెనాల్‌ రోడ్డు సమీపంలో మరణించినారు. పోలీసులు శవం కూడా మా కుటుబానికి అప్పగించకుండా సంబంధంలేని వ్యక్తులకు అప్పగించారు. ఈ విషయమై ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. అనపర్తి నియోజకవర్గంలో మా తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి 4 సార్లు, మా తమ్ముడు రామకృష్ణారెడ్డి ఒకసారి శాసన సభ్యులుగా చేసి ప్రజల అభ్యున్నతికి అన్నివిధాలా కృషి చేశారు. ఎన్నడూ మా కుటుంబంపై ఎటువంటి ఆరోపణలు లేవు. కానీ నేడు రాజకీయ దురుద్దేశాలతో ఒకవైపు నా భర్త శవాన్ని ఇవ్వకుండా మరోవైపు నా తోబుట్టువులపై అక్రమ కేసులు పెట్టి అడుగడుగునా వేధిస్తున్నారు, హింసిస్తున్నారు. అధికార వైసీ పార్టీ ఎమ్మెల్యే వైఖరితోనే అరుణకుమారి అనే మహిళ సూసైడ్‌ లెటర్‌ రాసి ఆత్మహత్య చేసుకుంటే ఇంత వరకు ఆ ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేయలేదు. కానీ ఏ సంబంధం లేని మా విషయంలో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మా కుటుంబ సభ్యుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతున్నాం.
–  తేతలి విజయలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *