కాకినాడ – తూర్పుగోదావరి
——————————————
తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి రోజువారీ మరింత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉన్న కోవిడ్-19 వాక్సినేషన్ సెల్ ను కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)కీర్తి చేకూరితో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న తొలి దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ, వివరాలు నమోదు, ప్రైవేట్ ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్, రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సన్నద్ధత తదితర అంశాలను వైద్యాధికారులను
క్షుణ్నంగా కలెక్టర్ అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోజు వారీ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత ఎక్కువ మందికి చేసే విధంగా వ్యాక్సినేషన్ సెంటర్లు పెంచాలన్నారు. జిల్లాలో ఈ నెల 20వ తేదీ వరకు అందిన వివరాలు ప్రకారం 11,673 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మూడు రోజులకు సంబంధించి లబ్ధిదారులకు ముందుగానే ఎస్ఎంఎస్ (మెసేజ్) రూపంలో సమాచారం అందించాలని ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్ వివరాలు ఎప్పటి కప్పుడు కొవిన్ యాప్ లో వివరాలు సక్రమంగా నమోదు చేయాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వైద్య అధికారులు నిరంతరం అప్రమత్తతో వ్యవహ రించాలని అధికారులకు కలెక్టర్ మురళీధర్ రెడ్డి సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె వి ఎస్ గౌరీశ్వర రావు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.వి.అరుణ, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *