నెల్లిపూడిలో ఇళ్ళ స్థలాల పంపిణీ

* సిఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకుక్షీరాభిషేకం

శంఖవరం – తూర్పుగోదావరి
————————————————
నెల్లిపూడిలో ఇళ్ళ స్థలాలను, పట్టాలను తాహసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం పంపిణీ చేసారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం నెల్లిపూడి శివారు బెండపూడి వెళ్ళే దారిలో మర్రి చెరువు మెట్టను ఆనుకుని సర్వే నెంబరు 126/5 లోని 2.54 ఎకరాల ప్రభుత్వ భూమిలో 84 మందికి ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయడానికి నిర్ణయించారు. అలాగే నెల్లిపూడి పంచాయితీ శివారు తిరుపతి అగ్రహారంలో ప్రభుత్వ రెవెన్యూ భూమి సర్వే నెంబరు 205 లో ఆరు ఎకరాల భూమి ఉంది. ఆరు ఎకరాలలోనూ ఆక్రమణలో ఉన్న 3.30 ఎకరాల జోలికి వెళ్ళకుండా 2.70 ఎకరాలను మరో 100 మందికి పట్టాలివ్వాలని నిర్ణయించారు. వీటిలో కొన్ని పట్టాలను లాంఛనంగా తాసిల్దారు గురువారం పంపిణీ చేసారు. తిరుపతి అగ్రహారంలోని భూముల విషయంలో కొందరు కోర్టులో కేసు వేసినందున ఇక్కడ పట్టాలకు బదులుగా మంజూరు పత్రాలను పంపిణీ చేసామని తాసిల్దారు లబ్దిదారులతో చెప్పారు. కోర్టు వ్యాజ్యం పరిష్కారం అయ్యాక పట్టాలు పంపిణీ చేస్తాము అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ చిత్ర పటాలకు లబ్ధిదారులు క్షీరాభిషేకం చేసారు.

 

With help of those services, you can make http://augustafreepress.com/best-research-paper-writing-services-verdict-of-the-student-survey/ sure that the work is completed on time without sacrificing any valuable time for other jobs.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *