– శంఖవరం ఎంపీడీఓ. రాంబాబు

శంఖవరం – తూర్పు గోదావరి
——————————————
అంగన్వాడీ బడుల్లో ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలని శంఖవరం ఎంపీడీఓ. రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ ప్రీప్రైమరీ విద్యను ఏ లక్ష్యం కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిందో ఆ లక్ష్యాన్ని సిబ్బంది ఆకళింపు చేసుకుని ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చ డానికి సిబ్బంది కృషి చేయాలని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్‌వాడీ బడులు ఇకపై వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ పాఠశాలుగా కొనసాగిస్తున్న నేపధ్యంలో చిన్నారి విద్యార్థులకు అందించే విద్యా బోధనలో సమూలమైన మార్పులు చోటు చేసుకోనున్న నేపధ్యంలో అంగన్వాడీ సిబ్బందికి, మహిళా పోలీసులకు శుక్రవారం ఇచ్చిన శిక్షణ లో ఆయన మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం మండల కేంద్రమైన శంఖవరంలోని సమగ్ర మాతా శిశు అభివృద్ధి పధకం ఆధ్వర్యంలో పధకం పరిధిలోని నియోజక వర్గంలోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండలాల స్థాయిలో ఈ శిక్షణ కొనసాగింది. శంఖవరం మండలంనకు సంబంధించిన సిబ్బందికి శంఖవరంలో మూడు రోజుల పాటు ఇచ్చారు. శంఖవరంలోని మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో శుక్రవారంతో ముగిసిన ఈ శిక్షణలో సిబ్బందిని ఉద్దేశించి రాంబాబు మాట్లాడారు. పూర్వపు విద్యా విధానాన్ని పూర్వ పక్షం చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలను సిబ్బంది నేర్చుకుంటూ పిల్లలకు ఆట పాటలతో ఆసక్తి కరంగా ఉండేలా భోధన అందించాలని ఆయన సూచించారు.

ప్రి ప్రైమరీ పాఠశాల పిల్లలకు ప్రి ప్రైమరీ 1, ప్రైమరీ 2 గా సిలబస్ కు సంబంధించి పిల్లలకు ఉపయోగపడే ఆట పాటలు, కథలు, మంచి అలవాట్లు, వర్క్ బుక్స్, స్పోకెన్ ఇంగ్లీష్, రిమోట్ లెర్నింగ్, స్కూల్ సంసిద్దత తదితర అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరిస్తూ చిన్నప్పటి నుంచే తెలుగు భాషతోపాటు ఇంగ్లిష్‌ భాషా మాద్యమంలో కూడా ప్రావీణ్యం కల్పించేలా నూతన సిలబస్‌, బోధనా నైపుణ్య విధానాలపై ఈ శిక్షణ ఇచ్చారు. ప్రతి త్రైమాసికానికీ అసెస్‌మెంట్, ప్రతి చిన్నారికి బుక్స్, ప్రీ స్కూల్‌ కిట్స్, కలర్‌ కార్డులు, బిల్డింగ్‌ బ్లాక్స్, ఫ్లాష్‌ కార్డులు, పోస్టర్లు, చార్ట్స్, లెర్నింగ్‌ కిట్స్, బొమ్మలు అందచేసి చక్కటి వాతావరణంలో ప్రాథమిక విద్యకు పునాది వేయాలని శిక్షకులు వివరించారు. అంగన్‌వాడీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ప్రీ స్కూల్‌ నిర్వహిస్తూ చిన్నారులకు విశ్రాంతి కోసం మధ్యలో గంటన్నర విరామం, రీడింగ్, స్టోరీ టైం, క్రియేటివ్‌ యాక్టివిటీ, యాక్షన్‌ సాంగ్, తదితర అంశాలతో రోజువారీ కార్యకలాపాలను నిర్వహించాలని ఈ శిక్షణలో బోధించారు. సిడీపీఓ. ఊర్మిళ, పర్యవేక్షకురాలు అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *