* క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డి

కాకినాడ‌ – తూర్పు గోదావరి
——————————————
ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్స‌వం సంద‌ర్భంగా కోవిడ్ నిబంధ‌న‌ల‌తో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌ నున్న‌ట్లు తూర్పు గోదావరి జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. శుక్ర‌వారం వెల‌గ‌పూడి నుంచి రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి కె.విజ‌యానంద్.. జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వం, ఈ-ఎపిక్ కార్డు, త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న వెబ్ రేడియో త‌దిత‌రాల‌పై అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఉన్న‌త అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి క‌లెక్ట‌ర్ కార్యాల‌యం నుంచి క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌ రెడ్డి జిల్లాస్థాయి అధికారుల‌తో క‌లిసి హాజ‌రు‌ అయ్యారు. 11వ జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్‌.. ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారికి వివ‌రించారు. ఎల‌క్టోర‌ల్ లిట‌ర‌సీ క్ల‌బ్స్ (ఈఎల్‌సీ) ద్వారా అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాలు, ర్యాలీలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌త్యేక సంక్షిప్త స‌వ‌ర‌ణ-2021కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దాదాపు ఎనిమిదివేల క్లెయిమ్‌లు, అభ్యంత‌రాల‌ను నిర్దేశ గ‌డువు జ‌న‌వ‌రి 31 నాటికి పూర్తిచేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. జ‌న‌వ‌రి 25 నుంచి ఈ-ఎపిక్ (ఎల‌క్ట్రానిక్ ఓట‌రు ఫొటో గుర్తింపు కార్డు) కార్డు డౌన్‌లోడ్ చేసుకునే విధానంపై కొత్త‌గా ఓట‌రుగా న‌మోదు చేసుకున్నవారికి అవ‌గాహ‌న క‌ల్పించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 10,05,625 పీవీసీ ఎపిక్ కార్డులు రాగా, 86 శాతం మేర పంపిణీ పూర్త‌యిన‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, మెప్మా పీడీ కె.శ్రీర‌మ‌ణి, ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దారు ఎం.జ‌గ‌న్నాథం త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *