అమలాపురం – తూర్పు గోదావరి
——————————————-
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కి అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ రెండు లక్షల రూపాయలు విరాళాన్ని అందచేశారు. శుక్రవారం అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయం తరపున మెంబర్ షిప్ గా రెండు లక్షల రూపాయల విరాళాన్ని డి.డి. రూపంలో రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి ద్వారా జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి కి అందచేశారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయం డివిజనల్ పరిపాలన అధికారి జే.వేంకటేశ్వరి, అమలాపురం మండల తహశీల్దార్ ఠాగూర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *