* జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి

కాకినాడ – తూర్పు గోదావరి
——————————————
నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాల పంపిణీ ప్రక్రియ త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ గ్రామీణ నియోజకవర్గం రమణయ్యపేట సచివాలయం- 4ను జేసి కీర్తి చేకూరి సందర్శించి సచివాలయం ద్వారా అందిస్తున్న సేవల వివరాలు, ఆరోగ్యశ్రీ, చెత్త సేకరణ, ఇళ్ల పట్టాల పంపిణీ తదితర అంశాలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాలంటరీల వారీగా పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు నేరుగా ఫోన్ చేసి వారితో సంభాషించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ విఆర్ వో ద్వారా వాలంటరీ లబ్ధిదారుని ఇంటికి వెళ్లి ఇంటి పట్టాను అందించాలన్నారు. మిగిలిన పట్టాల పంపిణీ కార్యక్రమం ఈరోజు సాయంత్రం నాటికి తప్పనిసరిగా పూర్తిచేయాలని జేసి తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి వివరాలు ఏ విధంగా నమోదు చేస్తున్నారో డిజిటల్ అసిస్టెంట్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని జెసి అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జేసి కీర్తి చేకూరి వెంట కాకినాడ గ్రామీణ మండలం ఎంపీడీవో పి నారాయణ మూర్తి,ఇతర అధికారులు పాల్గొన్నారు.

కరోనా టీకా కేంద్రాల పరిశీలన
——————————————-
జిల్లాలో జరుగుతున్న తొలిదశ కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి కాకినాడ అపోలో హాస్పిటల్, ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్లను వైద్య అధికారులతో కలిసి సందర్శించి,వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ పర్యటనలో జేసి వెంట జిజిహెచ్ సూపరిండెంట్ డా.ఎం. రాఘవేంద్ర రావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.వి అరుణ, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *