కాకినాడ – తూర్పుగోదావరి
——————————————
తూర్పుగోదావరి జిల్లాలో వివిధ హోదాల్లో ప్రభుత్వం అధికారిణిగా పని చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న జాయింట్ కలక్టర్ (వెల్పేర్) జి.రాజకుమారి ఐఏఎస్ గా పదోన్నతి పొందారు. ఐఏఎస్ గా పదోన్నతి పొందినట్లు శుక్రవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజకుమారి జిల్లాలో3 జూన్ 2017న డ్వామా ప్రోజెక్ట్ డైరెక్టర్ గా నియమితులు అయ్యారు. 14 డిశంబరు 2018 సంవత్సరంలో కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారి గాను, 24 జూలై 2019 సంవత్సరంలో జాయింట్ కలక్టర్-2 గా పని చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాల మేర జాయింట్ కలక్టర్ సంక్షేమంగా జిల్లాలో తనదైన శైలిలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఐఏఎస్ పదోన్నతి పొందిన రాజకుమారిని జిల్లా కలక్టర్ మురళీధర్ రెడ్డి, జాయింట్ కలక్టర్లు డా.జి.లక్ష్మిశ, కీర్తీ చేకూరి, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *