యస్.రాయవరం – విశాఖ జిల్లా
———————————————
విశాఖపట్నం జిల్లా, యస్.రాయవరం మండలం, కర్రివానిపాలెం కు చెందిన తాజా మాజీ ఎంపిటిసి బొలిశెట్టి గోవిందరావు రాజకీయ నాయకుడి ముసుగులో అనతి కాలంలోనే వందలాది ఎకరాల భూములు, కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టినా, గత ఏడాది మార్చి 2020 లో రద్దయిన స్థానిక ఎన్నికలలో తాను యస్.రాయవరం గ్రామ ఎంపిటిసి-2 అభ్యర్థి గాను, తన భార్య బొలిశెట్టి శారదాకుమారి ని ఎంపిపి చేయాలన్న ఉద్దేశo తో, ఎంపిపి, బి.సి. మహిళకు రిజర్వు రాగా, ఓ.సి. కాపుకు చెoదిన వీరు, తూర్పు కాపు సర్టిఫికెట్ పొంది బి.సి లకు చెoదవలసిన పదవిని, ఆ వర్గానికి ద్రోహంచేస్తూ, ఎంపిపి పదవి పొందాలన్న దురుద్దేయశo తో చినగుమ్ములూరు ఎంపిటిసి అభ్యర్థి గాను భార్యాభర్తలు ఇరువురు దాఖలు చేసిన నామినేసన్ పత్రాలు అపిడవిట్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం ఆస్తుల వివరాలు చూస్తే, ఎవరైనా ముక్కున వేలు వేసుకోవాలిసిందే అన్న వ్యాఖ్యలు నిజమేనని చెప్పక తప్పదు. అపిడవిట్ లో తెలిపిన ప్రకారం తన వృత్తి కొబ్బరికాయల వ్యాపారం అని, భార్య గృహిణిగా పేర్కొని 2019-2020 ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసిన ప్రకారం రూ 28,300 లు ఆదాయం మాత్రమేనని, పేర్కొనడం తన సంపాదన, అపిడవిట్ లో పేర్కొన్న ఆదాయం నక్కకు నాగలోకానికి ఉన్న తేడాగా, పొంతన లేని కాకి లెక్కలుగా స్పష్టమవుతుంది. ఇన్సూరెన్స్ వాయిదా యే రూ 59,150 లు, 2 కార్లు, ఒక టూ వీలర్, ఒక ట్రాక్టర్ ఉన్నట్లు, తనకు శృంగవరంలో 20 ఎకరాలు కర్రివానిపాలెం లో 2 ఎకరాలు మొత్తం 22 ఎకరాలు, తన భార్యకు శృంగవరం లో ఎ 6.62 సెంట్లు భూమి ఉన్నట్లు, తిమ్మాపురంలో 26 సెంట్లు గృహనిర్మాణ భూమి, కర్రివానిపాలెం వరహానది చెరువు గర్భంలో నిర్మించిన ఇళ్ళు, విశాఖపట్నంలో సీతమ్మదార లో ప్లాటు ఉన్నట్లు పేర్కొన్నారు.
వాస్తవంగా గత ఏడాది తన కుమార్తె వివాహం కోట్లాది రూపాయల ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా వివాహం చేసిన సంగతి అందరికీ విదితమే. అయితే వాస్తవంగా తన పేరున, తన భార్య పేరున కాకుండా రాజకీయ నాయకుని ముసుగులో అక్రమంగా సంపాదించిన ఆస్తులు బినామీలు పేర్లున కొనుగోలు చేసిన ఆస్తులు చూస్తే కళ్ళు బైర్లు కమ్మక తప్పదు. కర్రివానిపాలెం లో ఖాతా నెం. 663 సర్వే నెం. 128-7B5 లో ఎ 1.55 సెంట్లు, సర్వే నెం. 147 లో ఎ 0.58 సెంట్లు మొత్తం ఎ 2.13 సెంట్లు, వరహానది చెరువు గర్భంలో ఇల్లు, యస్.రాయవరం మాజీ సర్పంచ్ లాక్కోజు ఆదిమూర్తి పేరున ఖాతా నెం. 745 సర్వే నెం. 156 లో ఎ 1.27 సెంట్లు ను, కోర్టు ద్వారా దాఖలుపడి, కోర్టు అధికారులు స్వాధీనం చేసిన విలువైన స్థలమును అక్రమంగా 30.8.2019 కొనుగోలు చేసాడు. యస్.రాయవరం పశువుల హాస్పటల్ ప్రక్కన 0.12 సెంట్లు 60 లక్షలకు ఇటీవల కొనుగోలు చేసినట్లు తెలిసింది. తిమ్మాపురం లో సర్వే నెం. 108/1, 108/2, 9/2 లో తన పేరున, భార్య పేరున 0.26 సెంట్లు ఇళ్ల స్థలం, కర్రి వారి వద్ద సర్వే నెం. 92 లో ఎ 2.90 సెంట్లు లేఔట్ కొరకు కొనుగోలు. దార్లపూడి రెవిన్యూ చెల్లాపురం బస్టాప్ కు ఎదురుగా, అడ్డరోడ్డు-నర్సీపట్నం తారురోడ్డును అనుకొని ఖాతా నెం.1105 సర్వే నెం. 335-1, 2A, 3A, 2C, 2D, 3B, 2A, 3A, 4A, 4B గా ఎ 10.39 సెంట్లు విజయనగరం కు చెందిన తన మామ బసవ సత్యనారాయణ పేరున కొనుగోలు. నాతవరం మండలం శృంగవరం (గాంధీనగరం) లో ఖాతా నెం. 857 సర్వే నెం. 31-7 లో ఎ 6.63 సెంట్లు తన అత్త బసవ జయలక్ష్మి పేరున, తన భార్య పేరున 31-7 లో ఎ 6.67 సెంట్లు తన పేరున ఖాతా నెం. 855 లో 31-1A6 లో ఎ 10.3 సెంట్లు, 31-7 లో ఎ 9.70 సెంట్లు మొత్తం 20 ఎకరాలు, తన అక్క తలాటం వరలక్ష్మి (కాకినాడ) పేరున ఖాతా నెం. 31-7, 32, 38-1లో ఎ 13.75 సెంట్లు మొత్తం అందరి పేరున 47.00 ఎకరాలు కొబ్బరి తోట కొనుగోలు. నక్కపల్లి మండలం చినదొడ్డిగొల్లు లో (ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ల్యాండ్ సీలింగ్ భూమి) తన బావమరిది బసవ ప్రసాద్ పేరున ఖాతా నెం. 2268 సర్వే 251-1A-1D, 1A-1D-1A లలో ఎ 6.00 సెంట్లు, రెండవ బావ మరిది బసవ సూర్యనారాయణ మూర్తి పేరున ఖాతా నెం. 2265 సర్వే నెం. 251-1A 1D- A లో ఎ 6.00 సెంట్లు, తన అత్త బసవ జయలక్ష్మి పేరున ఖాతా నెం. 2271 A లో ఎ 1.00 సెంట్లు, తన మామ బసవ సత్యనారాయణ పేరున ఖాతా నెం. 2267 సర్వే నెం. 251-1A-B లో ఎ 1.00 సెంట్లు, తన పేరున అగ్రిమెంట్ తో కూడిన పవర్ ఆఫ్ అటార్నిగా సర్వే నెం. 251/1 లో ఎ 3.00 సెంట్లు, తన బాల్య స్నేహితుడు దాసరి నారాయణ రావు పేరున అగ్రిమెంట్ తో కూడిన పవర్ ఆఫ్ అటార్నిగా సర్వే నెం. 251/1 లో ఎ 3.00 సెంట్లు మొత్తం 20 ఎకరాలు కొనుగోలు, సీతమ్మధార లో ఒక ప్లాటు ఇన్ని ఆస్థులు ఉండి కూడా 2019-20 కు ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసినది రూ. 28,300 లు సంపాదనగా పేర్కొనడం నక్కకు నాగలోకానికి ఉన్న తేడా కాక మరేమిటి.
ఇవి కాకుండా తన కుటుంబం నివసిస్తున్న విశాఖపట్నం లోను, అత్తవారు ఉంటున్న విజయనగరం లోను, తన పెద్ద అక్క ఉంటున్న కాకినాడ పరిసర ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ, పలు ఆస్తులు కూడబెట్టినట్లు తన అనుచరులు చెబుతున్నారు. ఇన్ని ఆస్థులు ఉన్నా రాజకీయం చేసిన యస్.రాయవరం లో ఇటీవల కొనుగోలు చేసిన 0.12 సెంట్లు భూమి తప్ప ఇంకా ఇక్కడ ఏమి ఆస్తులు తన పేరున లేకపోవడం గమనించవలసిన విషయం. తాను అక్రమంగా సంపాదించిన ఆస్థులుకు బినామీలు గా తన అత్త, మామ, 2 బావమరుదులు పేరున ఎక్కువగా పెట్టడం తో తన ఆస్థులును అత్తగారి కుటుంబం గుప్పిట్లో పెట్టి ఇరుక్కున్నట్లు తన తోటి ముఖ్య అనుచరులు వ్యాఖ్యనిస్తున్నారు. నాయకుడు అంటే అందరికీ ఆదర్శంగా ఉండవలసి ఉండగా వందలాది ఎకరాలు, కోట్లాది రూపాయల ఆస్తులను అక్రమంగా సంపాదించాడు. తే 25.09.2019 ది న జస్టిస్ లోకాయుక్త, హైదరాబాద్ కు NO.938/2019/B2/LOK/1381/2020, Date:11.02.2020, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైస్.జగన్మోహనరెడ్డి కార్యాలయం పిర్యాదు నెం.158 లో స్వయంగాను, సిట్-2019 కు పిర్యాదు 43, 44 గా స్వయంగా కన్వీనర్, యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ, యస్.రాయవరం మండలం సోమిరెడ్డి రాజు పిర్యాదు చేశారు. ఇప్పటికైనా అక్రమ ఆస్తులు బైటపడతాయని భావిస్తున్నారు. అప్పటికీ న్యాయం జరగకపోతే హైకోర్టు లో ఆధారాలతో కేసు వేస్తానని తెలుపుతున్నారు. ఇన్ని అక్రమాలు చేస్తూ నీతి నియమాలు వల్లిస్తూ ప్రజలకు నీతి వ్యాఖ్యానాలు మాట్లాడే బొలిశెట్టి మాటలు నేతి బీరకాయ చందంగా ఉన్నది. యస్.రాయవరం గ్రామంకు 23 సం. సర్పంచ్ గా చేసి 25 ఎకరాలు అమ్ముకున్న దుబాసి అప్పన్న వంటి వారు ఏలిన గ్రామం, అలాగే మహాకవి గురజాడ అప్పారావు జన్మస్థలం అయి, అయిన సూక్తులైన “స్వంత లాభం కొంత మానుకొని తోటివారికి సాయపడవోయి” కు వింత భాష్యం చెబుతూ వందలాది ఎకరాలు, కోట్లాది రూపాయలు సంపాదించి తన ఏడాది మొత్తం ఆదాయం రూ 28,300 లు అని చూపడం ద్వారా, ఏ విధంగా ఇటువంటి నాయకులు సమాజానికి ఏమి న్యాయం చేస్తారో ప్రజలు పునరాలోచించు కోవాలి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *