లింగరాజుపాలెం – విశాఖ జిల్లా
——————————————
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజక వర్గం యస్.రాయవరం మండలం లింగరాజుపాలెం రెవెన్యూ సర్వే నెంబర్ 238లోని 9.20 ఎకరాల భూమి ఇనాం మెట్టు లోకల్ ఫండ్ ఛౌల్ట్రీ                 (దేవాదాయశాఖ) కు చెందిన భూమి అన్యాక్రాంతం ఐపోయింది. ఫైనల్ గజిట్ 2015 (22 ఎ) కూడా ఇనాం మెట్టు భూమిగానే రెవిన్యూ రికార్డులు చూపుతున్నాయి. అయితే ఇటీవల
రెవెన్యూ రికార్డులు అడంగల్, 1బి ప్రకారంగా ఈ భూమి సర్వే నెంబర్ 238 లోని ఎకరాలు 9.20 సెంట్లు జిరాయితి మాగాణి భూమిగా ఖాతా నెంబర్ 7777 గా పట్టాదారుగా ‘క్రయం’ పొందినట్లుగా చూపడంపై రెవిన్యూ అధికారులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకనగా ఈ భూమికి సరిహద్దుగా ఉన్న సర్వే నెంబర్ 237 లో ఎకరాలు 1.78 సెంట్లు భూమి డాక్టర్ చిట్టి పంతులు వద్ద ఇళ్ల పట్టాలకు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. అదే విధంగా ఇళ్ల పట్టాల భూములు కొనుగోలు చేసిన భూమిని ఎం.ఎన్.ఆర్.ఇ.జి.ఈ.యస్. నిధులు 1.41 లక్షలతో రోడ్లు తదితర ప్రాథమిక అవసరాలకు 4 ఎకరాలుకు ఖర్చు చేసినట్లుగా ఏ.పి.ఓ, డి.వి.సత్యవతి తన నివేదికలో తెలిపారు. దీని వలన ఇళ్ల లేఔట్ ను ఆనుకొని ఉన్న ఈ భూమి పై అక్రమార్కులు దుర్భుద్ధితో, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కు అయి ముందు జాగ్రర్తగా విలువైన ఈ భూమి 2015 వరకూ ఇనాం మెట్టు లోకల్ ఫండ్ ఛౌల్ట్రీ గా ఉండగా ఇప్పుడు సర్వే నెంబర్ 238 లోని ఎకరాలు 9.20 సెంట్లు జిరాయితి మాగాణి ఖాతా నెంబర్ 7777 గా పట్టాదారు ‘క్రయం’ గా చూపడంపై రెవిన్యూ అధికారులు అప్పటి తహశీల్దార్ కోరాడ వేణు గోపాల్ పని చేసిన సమయంలో రికార్డులు మార్పు చేసినట్లు పలువురు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రెవిన్యూ, దేవాదాయ శాఖ అధికారులు స్పందించి ఉమ్మడి సర్వే చేసి విలువైన దేవాదాయశాఖ భూములను కాపాడాలని కన్వీనర్, యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ. యస్.రాయవరం మండలం సోమిరెడ్డి రాజు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *