పెదమల్లాపురం – తూర్పు గోదావరి
—————————————————
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని ఉపప్రణాళిక ప్రాంతాన్ని రంపచోడవరం లోని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోకి చేర్చాలని గిరిజనులు కోరారు. తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు సూర్యకిరణ్ నేతృత్వంలో శంఖవరం మండలం పెదమల్లాపురంలోని గిరిజనులను శనివారం కలిపారు. పెద్దామల్లాపురం పరిసర గ్రామాల గిరిజనుల ప్రధానమైన సమస్యలను పరిష్కరించడంలో చిరంజీవి యువత సహాయాన్ని 10 రోజులు కిందట గిరిజనులు కోరారు. తమ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసికెళ్ళమని అభ్యర్ధించారు. ఈ నేపథ్యంలో ఈరోజు మెడిశెట్టి సూర్యకిరణ్, కరణం సుబ్రహ్మణ్యం, తుమ్మల రామలింగేశ్వర రావు, గాబు సుభాష్, చిన్న బాబీ, శమంగి యేసు, రాజు, రెడ్డి స్వామి తదితరులు పెదమల్లాపురం వెళ్ళి వారి సమస్యలను కూలంకషంగా అధ్యయనం చేసారు. వారి సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసికెళ్తామని హామీ ఇచ్చి యువత వెనుతిరిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *