కర్రివానిపాలెం – విశాఖ జిల్లా
————————————–
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం యస్.రాయవరం మండలం కర్రివానిపాలెం వరహా నది ఊట చెరువు గర్భంలోని అక్రమ నిర్మాణాలను ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయ స్థానం అడ్డుకున్నది. నిర్మాణాలను భేషరతుగా నిలిపి వేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

యస్.రాయవరం గ్రామ అభివృద్ధి కొరకు గ్రామ సచివాలయం భవనం -2, రైతు భరోసా కేoద్రo, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రం (వెల్ నెస్ సెంటర్) భవనాల నిర్మాణాలకు రూ. 76.75 లక్షల  నిధులు మంజూరు అయ్యాయి. కాగా, వరహానది (ఊట చెరువు)ని మట్టితో కప్పి నిర్మిస్తున్నట్లు, ఈ స్థలము కర్రివానిపాలెం గ్రామ రెవిన్యూకు చెందడం, వరహానది ఏటి గట్టును ఆనుకొని ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా, అక్రమంగా నిర్మిస్తున్నందున ఆ నిర్మాణాలను నిలుపుదల చేయాలని జిల్లా కలెక్టర్ తదితరులకు పిర్యాదు చేసి, సంబంధిత అధికారులు అందరికీ లీగల్ నోటీసులు ఇచ్చినా సంబంధిత యంత్రాంగాలు స్పందించలేదు. తమ పని తమదే అన్నట్లు   పనులు ప్రారంభించారు. దీంతో కన్వీనర్ యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ,  యస్.రాయవరం మండలం సోమిరెడ్డి రాజు హైకోర్టును ఆశ్రయిoచారు. ఫలితంగా హైకోర్టు  ‘స్టేటస్ కో’ ఇచ్చింది.

యస్.రాయవరం గ్రామానికి ఎం.జి.ఎన్.ఆర్. ఇ.జి.ఎస్ పథకంలో నిర్మాణాల కొరకు నిధులు మంజూరు చేశారు. ఈ నిర్మాణాలు ఎస్.రాయవరం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించ వలసి ఉండగా, కర్రివానిపాలెం గ్రామ నాయకుడు బొలిశెట్టి గోవిందరావు తన స్వార్థం కోసం, స్వార్ధ రాజకీయాల కోసం అధికారులను మభ్యపెట్టి యస్.రాయవరం సరిహద్దుగా ఉన్న కర్రి వీధి రోడ్డును ఆనుకొని తూర్పు వైపున సర్వే నెం. 132-2 లో ఎ 4.26 సెంట్లు లో ఉన్న వరహానది (ఊట చెరువు) గర్భంలో 0.15 సెంట్లు భూమిని మట్టితో నింపి ఈ భూమిలో నిర్మాణాలు చేపట్టడానికి 11.06.2020  న అనకాపల్లి ఎం.పి. బీశెట్టి వెంకట సత్యవతి, స్థానిక ఎమ్మెల్ల్యే గొల్ల బాబూరావు కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అలాగే నది బెడ్ (గట్టు) కు 30 మీటర్లు వరకు ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్ట కూడదన్న నీటి పారుదల శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టడం విషేశం. యస్.రాయవరం పంచాయతీకి మంజూరైన భవనాలను కర్రివానిపాలెం రెవిన్యూలో నిర్మాణాలు చేపట్టడానికి యస్.రాయవరం పంచాయతీ నుండి తప్పుడు తీర్మానాలు చేయడం, దీనికి మండల అధికారులు అప్పటి తహశీల్దార్ కోరాడ వేణు గోపాల్ తప్పుడు నివేదిక ఇచ్చి వత్తాసు పలకడం అధికారుల తీరు తెన్నులుకు, వీరి పని తీరుకు ఓ చక్కని ఉదాహరణ.

తాను, తన కుటుంబ సభ్యులు మరో 23 మంది ఈ వరహానది గర్భంను ఆక్రమించుకొని, భారీ భవంతులు నిర్మించు కున్నారు. అదే విధంగా కర్రివానిపాలెంకు చెoదిన వీరు యస్.రాయవరం గ్రామంలో ఓటర్లుగా కొనసాగాలన్న స్వలాభంతో కర్రివానిపాలెంకు చెందిన వరహానది (ఊట చెరువు) ను యస్.రాయవరంనకు చెందినవిగాను, తనవి, తన బంధువుల గృహాలు యస్.రాయవరంలో ఉన్నాయని సాక్ష్యంగా చెప్పుకునేందుకు, తన  స్వార్థం, స్వార్ధ రాజకీయాల కొరకు మండల అధికారులతో కుమ్మక్కు అయి, కర్రివానిపాలెం వరహానది గర్భంను మట్టితో పూడ్చి నిర్మాణాలు చేపట్ట డానికి అధికారులతో పంచాయతీ తప్పుడు తీర్మానాలు చేసారు.

నదీ గర్భoలో నిర్మాణాలు చేపట్ట కూడదని గతంలో ఉన్నత న్యాయస్థానాలు తీర్పులను ఇచ్చిన దృష్ట్యా నిర్మాణాలు చేపట్టవద్దని, నదీ గర్భంలో 24 మందికి చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని, కర్రివానిపాలెంనకు చెందిన వీరిని యస్.రాయవరం గ్రామ ఓటర్ల జాబితా నుండి తొలగించి, కర్రివానిపాలెం ఓటర్లుగా చేర్చాలని  06.07.2020 న జిల్లా కలెక్టర్ కు సోమిరెడ్డి రాజు స్పందన కార్యక్రమంలో ఇచ్చిన ఫిర్యాదుపై 4 వారాలలో జిల్లా కలెక్టర్ ను ఎప్రోప్రియేట్ ఆర్డర్ ఇవ్వాలని అప్పటి వరకు స్టేటస్ కో విధిస్తున్నట్లు హైకోర్టు రిట్ పిటిషన్ 379 అఫ్ 2021 తే 06.01.2021 దిన జస్టిస్ డి.రమేష్ అడ్వకేట్ కె. సత్యనారాయణమూర్తి వేసిన వ్యాజంకు తీర్పు ఇవ్వడం జరిగింది. దీనితో తాను ఒకటి తలిస్తే ఆ భగవంతుడు ఇంకొకటి తలిచాడని, ‘బొలిశెట్టి’కి చావు తప్పి కన్ను లొట్ట పడిందని, బొలిశెట్టి’ అన్యాయాలు, అక్రమాలకు కాలమే సమాధానం చెబుతున్నదన్న వ్యాఖ్యానాలు స్థానికంగా వినిపిస్తు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *