లింగరాజుపాలెం – విశాఖ జిల్లా
——————————————-
విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజక వర్గం ఎస్.రాయవరం మండలంలోని లింగరాజుపాలెం లోని అన్యాక్రాంతమైన రెవెన్యూ భూములను
విశాఖపట్నం దేవాదాయశాఖ ధర్మాదాయశాఖ
అసిస్టెంట్ కమీషనర్ కలింగిరి శాంతి సోమవారం పరిశీలించారు. విశాఖపట్నం జిల్లా యస్.రాయవరం మండలం  సర్వే నెంబర్ 238 లోని ఎకరాలు 9.20 సెంట్లు భూమి ఇనాం మెట్టు లోకల్ ఫండ్ ఛౌల్ట్రీ ( దేవాదాయశాఖ) కు చెందిన భూమిగా ఫైనల్ గజిట్ 2015 (22 ఎ) కూడా ఇనాం మెట్టు భూమిగానే రెవిన్యూ రికార్డులు చూపుతున్నాయి. అయితే ఇటీవల రెవెన్యూ రికార్డులు అడంగల్, 1బి ప్రకారంగా ఈ భూమి సర్వే నెంబర్ 238 లోని  9.20 ఎకరాలను జిరాయితి మాగాణి ఖాతా నెంబర్ 7777 గా పట్టాదారుగా ‘క్రయం’ గా చూపడంపై రెవిన్యూ అధికారులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కన్వీనర్, యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ. యస్.రాయవరం మండలం సోమిరెడ్డి రాజు స్థానిక రెవెన్యూ, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సదరు అన్యాక్రాంతంపై అధికారులు స్పందించలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే విధించింది. ఈ నేపధ్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయ సిబ్బందిని వెంట పెట్టుకుని లింగరాజుపాలెం వెళ్ళి సదరు భూములను ఆమె పరిశీలించారు. రెవెన్యూ అధికారుల నుంచి వివరాలు తెలుసు కున్నారు. సమగ్ర వివరాలతో కూడిన నివేదికను తనకు సమర్పించాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆమె ఈ సందర్భంగా
ఆదేశించారు. ఆపై భూముల అన్యాక్రాంతంపై తదుపరి చర్యలు చేపడతామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహశీల్ధార్ చారి, మండల సర్వేయర్ రామారావు, దేవాదాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *