శంఖవరం – తూర్పు గోదావరి
——————————————-
ఎన్నికల సక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడానికి సిబ్బంది సన్నద్దమవ్వాలని శంఖవరం ఎంపీడీవో జె.రాంబాబు పిలుపు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన శంఖవరంలోని మండల ప్రజాపరిషత్తు కార్యాలయం సమావేశ మందిరంలో సచివాలయాల కార్యదర్శులు, వీఆర్వోలు, వెల్ఫేర్, ఇంజనీరీంగ్, హౌసింగ్ తదితర ప్రభుత్వం శాఖల సిబ్బందికి ఎన్నికల ఏర్పాటు సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. గణతంత్ర దినోత్సవ నిర్వహణా ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన భవనాల ఎంపిక, అక్కడ విద్యుత్, నీటి సౌకర్యం, బయోమెట్రిక్ పరికరాలు, సచివాలయాల దస్త్రాల నిర్వహణ, గృహ నిర్మాణశాఖ లక్ష్యాలు, లబ్దిదారుల గృహ నిర్మాణ విధాన ఎంపికలు, ఐహెచ్ఎల్. మరుగుదొడ్ల నిర్మాణం, ఇంటి, కుళాయి పన్నుల వసూళ్లు వంటి విషయాలపై ఎంపీడోవో చర్చించి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. హౌసింగ్ ఏఈ.రమణ, మండలం పరిషత్తు పరిపాలనాధికారిణి మేరీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *