* అభివృద్ధి చేద్దామనుకుంటే అవమానం మిగిలింది
* ఎంపీకి గుదిబండగా మారిన ద్వితీయ శ్రేణి నాయకత్వం
* ఇకపై కూడా నమ్ముకుంటే నట్టేట్లో మునిగినట్టే
* గుణపాఠంగా మిగిలిన కర్రివానిపాలెం ఉదంతం
* ఇకనైనా స్వీయ విచక్షణతో ముందడుగేస్తారా ?
* రచ్చబండపై ఎస్.రాయవరం కురాజకీయం రచ్చ

ఎస్.రాయవరం – విశాఖ జిల్లా
———————————————
లోక జనని, సాక్షాత్తూ శ్రీరాముని సహధర్మచారిణి సీతా మాతను శీల పరీక్ష శిక్షకు నిలిపిన లోకం… ప్రపంచ శాంతి దూత ఏసుక్రీస్తును సైతం శిలువపై మరణ శిక్ష విధించిన వారసత్వం… మానవ మాతృలు ఉద్దేశపూర్వకంగా నేరాలు చేస్తూ పోతూంటే ఊరుకుంటుందా…? అదే దుష్ట రాజకీయమైతే ఉతికి ఆరేయరూ…? విమర్శలతో ఊదిపారేయరూ…? ఇదే జరుగుతోంది ఎస్.రాయవరంలో. ఎస్.రాయవరం రాజకీయం అంటే ప్రజలందరి సామూహిక ప్రజా ప్రయోజనం కన్న… ఏక వ్యక్తి స్వార్ధ ప్రయోజనమే మిన్న… ఆయనే నిత్య వార్తల్లో వ్యక్తి బొలిశెట్టి గోవిందరావు. ఈ ద్వితీయ శ్రేణి రాజకీయ నేతతో సహచర్యం అంటే ఆయనతో పాటు ఉన్న వారూ అనివార్యంగా విమర్శలు, అపవాదులు, ఆపదల్లో ఊహించని రీతిలో ఇరుక్కోవడం పరిపాటిగా మారింది… అందులో ఓ ఉదంతం ఇది…

అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు భీశెట్టి వెంకట సత్యవతి పరువును ఆమె జన్మస్థలమైన
ఎస్.రాయవరంలో తన పార్టీ నాయకుడు తాజా మాజీ ఎంపిటిసి బొలిశెట్టి గోవిందరావు తన పంతానికి తీసినట్లు గ్రామస్తుల నుంచి తాజా వ్యాఖ్యానాలు జోరుగా సాగుతున్నాయి. అనకాపల్లి ఎం.పి సత్యవతి జన్మస్థలం యస్.రాయవరం గవరవీధిలో పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఆమెకు స్వంత ఇల్లు ఉంది. ఈమె తండ్రి జిల్లా కోపరేటివ్ బ్యాంకు ఉద్యోగిగా పనిచేసిన ఓ మంచి మనిషిగా గ్రామస్తులకు సుపరిచితుడు. ఆ మంచి మనిషి కుమార్తె, తమ గ్రామస్తురాలైన భీశెట్టి వెంకట సత్యవతి 2019 ఎన్నికలలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైనందుకు గ్రామస్తులందరూ ఎంతో సంతోషించారు. అయితే జన్మ స్థలంలో చేపట్టిన అభివృద్ధి పనుల శిలాఫలకాలపై తన పేరు ఉంటే ఆ ఆనందం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐతే ఆ ఆనందం కంటే ఆ అభివృద్ధి పనులు హై కోర్టు ఆవేశంతో ఆగిపోయిన అవమానమే ఎక్కువ.

సత్యవతి ఎం.పిగా తన నిధులతో ప్రప్రధమంగా ఓకే రోజు వేసిన రెండు శిలాఫలకాల ఆవిష్కరణ, నిబంధనలకు వ్యతిరేకంగా స్థలాలను ఎంపిక, పనుల ప్రారంభం చేయడం పట్ల హైకోర్టులో వాజ్యాలను వేయగా స్టేటస్ కో తో అనంతరం
పనులు అర్దాంతరంగా మధ్యలో ఆగిపోయి బోడి బిల్డింగ్ లతో శిలాఫలకాలతో మిగిలిపోయి సొంత గ్రామస్తుల వద్దే పరువు తీసుకున్నారని గ్రామస్తుల నుంచి వ్యాఖ్యానాలు జోరుగా వినపడు తున్నాయి.

11.06.2020 న స్థానిక ఎమ్మెల్ల్యే గొల్ల బాబురావుతో కలిసి దుబాసివీధి, పోస్టాపీసు వద్ద తన ఎం.పి ల్యాండ్ నిధులతో కమ్మూనిటి భవనంనకు, కర్రివీధి రోడ్డు ఆవల కర్రివానిపాలెం వరహానది గర్భం ఊటచెరువులో సచివాలయం – 2, రైతు భరోసా కేoద్రం, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రం (వెల్ నెస్ సెంటర్) కు రూ 76.75 లక్షలతో రెండు పనులు ఒకే రోజు శిలాఫలకాలను ఆవిష్కరించారు. దుబాసివీధి కమ్యూనిటి భవనంనకు గ్రామస్తుడైన సోమిరెడ్డి అదినాగమణి కుమార్ కు పూర్వీకుల నుండి దాఖలు పడి 100 ఏళ్ల క్రితం రిజిస్టర్ దస్తావేజులు, 1960 సం. లో జిల్లా కోర్టులో డిక్రీ ద్వారా, 2013 సం. లో కుటుంబీకుల పార్టీషన్ డీడ్ ద్వారా అన్ని రికార్డులు ఉన్నా, బొలిశెట్టి తన పంతం కొరకు, తన సోదరి తన్నీరు రామలక్ష్మి సర్పంచ్ గా ఉన్న సమయంలో తప్పుడు తీర్మానంతో ప్రభుత్వ స్థలంగా చిత్రీకరించి దుబాసివీధి స్కూల్ ఆట స్థలంకు చెందినది గాను, తరువాత కమ్యూనిటీ భవనంకు కేటాయించామని, అధికారులతో కుమ్మక్కు అయి శంకుస్థాపన సమయంలో
పోలీస్ స్టేషన్ లో ఉంచి, యస్.రాయవరం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మరీ శంఖుస్థాపనులు చేశారు. యలమంచిలి కోర్టులోను, లోకాయుక్త లోను, యలమంచిలి కోర్టు, హైకోర్టులోను స్థలం యజమానులు రిట్ పిటిషన్ వేయగా ‘స్టేటస్ కో’తో పనులు ఆగిపోయాయి. ఈ స్థలములో ప్రహరీ గోడ పడగొట్టినందుకు అప్పుడు బొలిశెట్టి మరో ఐదుగురిపై పోలీస్ కేసు నమోదైనది. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి పంచాయతీ ప్రహారీ గోడను పడగొట్టిన వివాదంలో బొలిశెట్టి పుణ్యమా అని జిల్లా కలెక్టర్ వి.వినయచంద్, అప్పటి తహశీల్దార్ కోరాడ వేణుగోపాల్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏ.వి.యస్.యస్. ప్రసాద్, ప్రిన్సిపాల్ సెక్రటరీ డి.కె. ద్వివేదిపై కంటెంప్ట్ అఫ్ కోర్ట్ కేసు వేయగా ఆ కేసు నడుస్తున్నది.

యస్.రాయవరం గ్రామ అభివృద్ధి కొరకు గ్రామ సచివాలయం భవనం-2, రైతు భరోసా కేంద్రం, వెల్ నెస్ సెంటర్ భవనాల నిర్మాణాల కొరకు 76.75 లక్షలు రూపాయల నిధులు మంజూరు కాగా, కర్రివానిపాలెం గ్రామ నాయకుడు బొలిశెట్టి గోవిందరావు తన స్వార్థం కోసం, స్వార్ధ రాజకీయాల కోసం అధికారులను మభ్యపెట్టి యస్.రాయవరం సరిహద్దుగా ఉన్న కర్రివీధి రోడ్డును ఆనుకొని తూర్పువైపున సర్వే నెం. 132-2 లో ఎ 4.26 సెంట్లు లో ఉన్న వరహానది (ఊటచెరువు) గర్భoలో 0.15 సెంట్లు భూమిని మట్టితో నింపి, ఈ భూమిలో నిర్మాణాలు చేపట్టడానికి పూనుకొన్నారు. బొలిశెట్టి మరో 23 మంది తన కుటుంబ సభ్యులు ఈ వరహానది గర్భంను ఆక్రమించుకొని అక్రమంగా భారీ భవంతులు నిర్మించుకున్నారు. అదే విధంగా కర్రివానిపాలెంకు చెందిన వీరు యస్.రాయవరం గ్రామంలో ఓటర్లుగా కొనసాగాలన్న దురుద్దేశoతో, కర్రివానిపాలెంనకు చెందిన వరహానది ఊట చెరువును యస్.రాయవరంనకు చెoదినదిగా ప్రజలను మభ్యపెట్టడానికి, తనవి, తన బంధువుల గృహాలు యస్.రాయవరంలోనే ఉన్నాయని సాక్ష్యంగా చెప్పుకోవడo కోసం స్వార్థంతో, తన స్వార్ధ రాజకీయాల కొరకు మండల అధికారులతో కుమ్మక్కు అయి, కర్రివానిపాలెం వరహానది గర్భంను మట్టితో పూడ్చి నిర్మాణాలు చేయడానికి అధికారులతో పంచాయతీ తప్పుడు తీర్మానాలు ద్వారా పనులు చేయడానికి ప్రయత్నిoచారు. ఈ స్థలం వరహానది (ఊట చెరువు) గర్భం అయినందున, కర్రివానిపాలెం గ్రామ రెవెన్యూకు చెందడం వలన, వరహానది బెడ్ (ఏటిగట్టు)కు 30 మీటర్లు వరకు ఎటువంటి శాశ్వత కట్టడాలు నిర్మించ కూడదన్న నీటి పారుదల శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో వకీలు తాఖీదు ఇచ్చినా నివారణా చర్యలు చేపట్టక పోవడంతో యస్.రాయవరం మండలం యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి రాజు హైకోర్టును ఆశ్రయిoచారు. నదీ గర్భoలో నిర్మాణాలు చేపట్ట కూడదని ఉన్నత న్యాయ స్థానాలు గతంలోఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ తమ ఎస్. రాయవరం మండలం కర్రివానిపాలెం వరహానది గర్భం (ఊట చెరువు) లో నిర్మాణాలను చేపట్టవద్దని, నదీ గర్భంలో 24 మందికి చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని, కర్రివానిపాలెంనకు చెందిన వీరిని యస్.రాయవరం గ్రామ ఓటర్ల జాబితా నుండి తొలగించి, కర్రివానిపాలెం ఓటర్లుగా చేర్చాలని 06.07.2020 దిన జిల్లా కలెక్టర్ కు సోమిరెడ్డి రాజు స్పందన కార్యక్రమంలో ఇచ్చిన ఫిర్యాదుపై నాలుగు వారాలలో జిల్లా కలెక్టర్ ను ఎప్రోప్రియేట్ ఆర్డర్ ఇవ్వాలని, హైకోర్టు రిట్ పిటిషన్ 379/2021 / 06.01.2021 న అడ్వకేట్ కె. సత్యనారాయణ మూర్తి వేసిన వ్యాజంపై జస్టిస్ డి.రమేష్ ‘స్టేటస్ కో’ తీర్పు ఇవ్వడంతో పనులు అర్ధాంతరంగా నిలిచి పోయాయి.

మొదటి స్థలం తన ఇంటికి కూసింత దూరంలో ఉండడం, ఈ స్థలం యజమానులదే అని, అన్ని రికార్డులు ఉన్నాయని, కోర్ట్ వివాదంలో ఉన్నదని, సత్యవతికి తెలిసి కూడా తన నిధులు కేటాయించడం, పనుల ప్రారంభించడానికి రావడం, రెండవ స్థలము చెరువు గర్భంలో నిర్మిస్తారని తెలుస్తున్నా, తగుదునమ్మా అంటూ వచ్చి, ఆర్భాటంగా రిబ్బన్లు కత్తిరించి, ఇప్పుడు అర్ధాంతరంగా పనులు ఆగి పోవడంతో భవనాలు మధ్యలో ఆగిపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయమై ఎంపీని తమ బందువర్గం కూడా విమర్శించడం పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది. దీనితో లేక లేక తన స్వగ్రామంలో ఎంతో అట్టహాసంగా ఒకే రోజు వేసిన రెండు శంకుస్థాపన శిలాఫలకాలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలి పోవడంతో ఎంపీ పరువును తన స్వార్ధం కోసం బొలిశెట్టి తీసినట్లు ఎంపీ స్వంత కులస్తులు సత్యవతిపై వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ
వ్యాఖ్యానాల పట్ల ఏవిధంగా ప్రతిస్పందిస్తారో మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *