కాకినాడ‌ – తూర్పు గోదావరి
—————————————–
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలొ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (ఎస్ఈసీ) నిమ్మ‌గడ్డ ర‌మేశ్‌కుమార్ వెల‌గ‌పూడి నుంచి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్‌పీల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి క‌లెక్ట‌రేట్ నుంచి క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, ఎస్‌పీ అద్నాన్ న‌యీం అస్మీ, రాజమండ్రి అర్బన్ ఎస్పి షేమూషి బాజ్ పాయ్, జేసీ (డీ) కీర్తి చేకూరి త‌దిత‌రుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ హాజ‌ర‌య్యారు. ఎన్నిక‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్ధ‌త పరంగా అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్‌.. ఎస్ఈసీకి తెలిపారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన సామాగ్రిని సిద్ధం చేస్తున్నామ‌న్నారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో శాంతిభ‌ద్ర‌త‌లకు విఘాతం క‌ల‌గ‌కుండా చూసేందుకు బందోబ‌స్తు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఎస్‌పీ అద్నాన్ న‌యీం అస్మీ తెలిపారు. ఓ వైపు కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ స‌జావుగా సాగేందుకు.. అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు ఆటంకం లేకుండా చూసేందుకు సిబ్బందిని మోహ‌రిస్తామ‌ని పేర్కొన్నారు. స‌మావేశంలో అడిషనల్ ఎస్పి కరణం కుమార్, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, డీఆర్‌డీఏ పీడీ వై.హ‌రిహ‌ర‌నాథ్‌, మెప్మా పీడీ కె.శ్రీర‌మ‌ణి, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ‌, పెద్దాపురం ఆర్‌డీవో ఎస్‌.మ‌ల్లిబాబు , సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు వివిధ విభాగాల అధికారులు హాజ‌రు అ‌య్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *