* ఆనందంతో కృతజ్ఞతలు చెప్పిన అధ్యాపకులు

శ్రీకాకుళం – జనాసవార్త
————————————-
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి బి. చంద్రకళ, సమగ్ర శిక్ష పధకం అదనపు కోఆర్డినేటర్ పైడి.వెంకట రమణకు శ్రీకాకుళం కేజీబీవీ జూనియర్ కళాశాల అధ్యాపకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వీరంతయా ఈ విద్యా సంస్థ నుంచి లోగడ తొలగించారు. ఇటీవల వీరు పునర్నియామకం పొందారు. 2019 – 2020 విద్యా సంవత్సరంలో కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాలలో 20 మంది అధ్యాపకులను అప్పటి సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి అయినా శ్రీనివాస రావు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి కేజీబీవీ ఇంటర్మీడియట్ కళాశాలలో వారు పని చేశారు, అయితే వారిని ఈ విద్యా సంవత్సరం అయినా 2020 – 2021 సంవత్సరంలో గత 8 నెలలుగా అర్ధాంతరంగా వీరిని విధుల నుంచి తొలగించారు కారణం అన్వేషిస్తే వీరి అప్పటి సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస రావు ఉత్తరాలలో లోపము ఉండడంతో వీరిని ఈ విద్యా సంవత్సరం విధులను దూరంగా ఉంచారు , అయితే ఈ ఉద్యోగం కోల్పోయిన అధ్యాపకులు జిల్లా వై. య. స్సా. ర్ . రాజకీయ పక్ష నేతలకు , నియోజకవర్గ ఎమ్మెల్యే లకు, మంత్రులకు, స్పీకర్లకు , అనేకసార్లు వినతి పత్రం అందజేశారు, అయితే జిల్లా విద్యాశాఖ అధికారులకు , శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్ జె . నివాస్ కు కూడా అనేకసార్లు వినతిపత్రం అందజేశారు , అయితే మానవతా దృక్పథంతో ఈ ఏడాది వీరందరినీ వీరి ఉద్యోగం పునర్నియామకం ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ జె . నివాస్, శ్రీకాకుళం జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ శ్రీనివాస రావు కు ఈ 20 మంది ఉద్యోగం తొలగించబడిన కే. జీ. బీ. వీ. అధ్యాపకులు తిరిగి వారికి ఉద్యోగం రావడం తో వారు ప్రత్యేకంగా , జిల్లా కలెక్టర్ కు, జాయింట్ కలెక్టర్ కు,జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *