* మంచి వారికే సర్పంచ్ కిరీటం
* అభ్యర్ధుల ఎంపికకు కమిటీలు
* ప్రభుత్వ మాట ప్రత్తిపాడుకు బాట
* ఏకగ్రీవం ప్రోత్సాహం రూ. 20 లక్షలు
* ఏకగ్రీవాలకే ఎమ్మెల్యే పిలుపు
* ఊర్లు, వర్గాల వారీ సమీక్షలు
* ఏకగ్రీవాలతో ప్రభుత్వ ప్రతిష్టకు కృషి

శంఖవరం – తూర్పు గోదావరి
———————————————
ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం… తమ పాలకులను ఎన్నుకునే అంతిమ నిర్ణయ అధికారం ప్రజలదే… భారతీయ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు… ఈ రాజ్యాంగ స్ఫూర్తి నెరవేర్చడానికి రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా, పార్టీ గుర్తులకు అతీతంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఏకగ్రీవ ఎన్నికలకే మిగతా రాష్ట్రాలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొగ్గు చూపుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ పంచాయితీల్లో ఎన్నికలను ఏకగ్రీవాలను చేయాలని పిలుపు నిచ్చింది. ఆ లక్ష్యం నెరవేర్చే దిశగా ఏకగ్రీవాల ఆధిక్యాన్ని ప్రోత్సాహించేందుకు మునుపటి వరకూ ఇస్తూ వస్తోన్న నగదు బహుమతిని భారీగా రూ. 20,000,00 లక్షల వరకూ పెంచింది. దీనికోసం ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 34 ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామాల్లో శాంతి యువత వాతావరణం నెలకొనాలని, అందుకు ఏకగ్రీవంగా ఎన్నికలు దోహదం చేస్తాయని, సమయం, ఎన్నికల సమయం ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అంతే కాకుండా రూ. 20,00.000 వరకూ నగదు బహుమతిని మిగతా నిధులకు అదనంగా ప్రభుత్వం ఇస్తోందని, దీంతో పంచాయితీని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని చెబ్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఈ పిలుపును తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ అంది పుచ్చు కున్నారు. ప్రభుత్వ ఏకగ్రీవ ఎన్నికల విధాన ప్రకటనను తను సొంతం చేసుకున్నారు. ఓ 40 ఏళ్ళ సీనియర్ నేతగా ప్రభుత్వ ఆంతర్యాన్ని ఆయన ఇట్టే గ్రహించారు. వెను వెంటనే ఆచరణలో పెట్టారు. ఈయన ఇదే బాణీని ఇదే పిలుపునకు ముందు నుంచీ వివిధ ఎన్నికల్లో అనుసరిస్తూ వస్తూన్న నేపధ్యంలో ప్రభుత్వం ప్రోత్సాహం ఎమ్మెల్యేకు మరింత బలాన్ని ఇచ్చింది. దీంతో ప్రభుత్వ మాటనే ఈయన ఈ ఎన్నికల్లో కూడా తన బాసటగా చేసుకున్నారు.

పెద్దాపురం రెవెన్యూ డివిజన్లోని 12 మండలాల్లో 226 పంచాయతీలు, 2,478 వార్డులు ఉన్నాయి.
5,97,931 మంది ఓటర్లు న్నారు. వీరి కోసం మొత్తం 2,514 పోలింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఈ నేపథ్యంలో తన ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండలాల్లో అన్ని పంచాయితీల్లో ఏకగ్రీవ ఎన్నికలకు కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఆయన సరి కొత్తగా వ్యూహాత్మకంగా వ్యవహ రిస్తున్నారు. మునుపు ఎన్నికల్లో ఆయన అనుసరించిన అంతర్గత వ్యూహాలకు మరింత పదును పెట్టారు. నియోజక వర్గంలోని నాలుగు మండలాలు, వివిధ గ్రామాలు, ఆయా సామాజిక వర్గాల వారీగా కార్యకర్తలు, ప్రజలతో విడివిడిగా రోజు వారీ సమీక్షా సమావేశాలను ఇటీవల కాలంలో నిరంతరం నిర్వహిస్తున్నారు. అందుకు కొన్ని సమావేశాలకు శంఖవరంలోని తన సొంత ఇంటినే వేదికగా చేసుకున్నారు. ప్రజలను, కార్యకర్తలను సమన్వయ పరుస్తూ రాత్రి, పగలూ అనే కాల సమయం పట్టింపులు లేకుండా సమీక్షలు నిర్వహిస్తూ ఏకగ్రీవ ఎన్నికలకు పిలుపు నిస్తున్నారు.

మంచి వారినే సర్పంచ్ అభ్యర్ధులుగా సూచిస్తూ ఏకాభిప్రాయానికి రావాలని సూచిస్తున్నారు. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు గ్రామంలోని ఓటర్ల అందరి ప్రతినిధులుగా కొంత మందితో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్థులు, ఓటర్ల ఏకాభిప్రాయంతో అభ్యర్ధిని ఎంపిక చేయడం, గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నికలకు కృషి చేయడం ఈ కమిటీల విధి. తన చిన్నాన్న, ప్రత్తిపాడు మాజే ఎమ్మెల్యే, స్వర్గీయ పర్వత సుబ్బారావు కాలం నుంచి ఏకాభిప్రాయంతో పంచాయితీల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరుగు తున్నాయి అని ఈ సమావేశాల్లో ఎమ్మెల్యే నొక్కివక్కాణిస్తున్నారు. ప్రత్తిపాడు నియోజక వర్గంలో పర్వత వంశం నుంచి పర్వత గుర్రాజు మొదలుకొని తన వరకూ వరుసగా ఐదుగురు ఎమ్మెల్యేలను అందించి ఆ నేతలపై విశ్వాసం, గౌరవం, నమ్మకం ఉంచిన నియోజకవర్గం ప్రజలు ఈ ఎన్నికల్లో కూడా ఏకతాటిపై ఏక మాటపై ఉండి పోటీ లేకుండా ఎన్నికల ఏకగ్రీవానికి కృషి చేసి ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చి, ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింప చేయాలని ఎమ్మెల్యే ప్రసాద్ విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *