శంఖవరం – తూర్పు గోదావరి
——————————————-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి అంగన్వాడీ బడులు పునఃప్రారంభం కానున్నాయి. 1 నుండి ప్రీ స్కూల్ నుంచి ప్రారంభించాలని గుంటూరులోని రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంచాలకులు లేఖ నెం .24028/3/2020తో 27/01/2021 ద్వారా
ఉత్తర్వులను జారీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం 36 నెలల నుండి 72 నెలల పిల్లలకు (3 నుండి 6 సం.ల ) ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 1 గంట వరకు పాఠశాలను నిర్వహిస్తూ కరోనా నిబంధనలను పాటిస్తూనే మధ్యాహ్నం భోజనం అందివ్వాలని ఆ ఉత్తర్వుల్లో సూచించారు. అలాగే గర్భిణీలు, బాలింతలకు 25 రోజులకు మొత్తం 3 కేజీల బియ్యం, 1 కేజీ పప్పు, వంట నూనె, వైఎస్సార్ కిట్స్ -1, 25 గుడ్లు, 5 లీటర్ల పాలు, 2 – 6 నెలల నుండి 3 సం.ల పిల్లలకు 25 రోజులకు ఒక్కొక్కరికి బాలామృతం 2.5 కేజీలు చొప్పున 30 రోజులకు 30 గుడ్లు, పాలు 6 లీటర్లు చొప్పున యధావిధిగా రూపంగా పంపిణీ చేయవలసిందిగా ఆ ఉత్తర్వుల్లో సూచించారు. బాలింతలు, గర్భీణీలను అత్యవసర మైతేనే అంగన్వాడీ బడులకు రానివ్వాలని తమను రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంచాలకులు ఆదేశించినట్టు శంఖవరం సమగ్ర శిశు అభివృద్ధి అధికారిణి బి.ఊర్మిళ ఓ ప్రకటనలో తెలిపారు.
అంగన్వాడీల్లో అత్యవసర నియమాలు
—————————————————-
అంగన్ వాడీ కేంద్రం, పరిసరాలు కూడా పరిశుభ్రంగాా ఉండాలని, అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు, అంగన్వాడి సందర్శకులు ప్రతి ఒక్కరు అంగన్వాడీ కేంద్రాల్లో ముక్కు, నోరు మూసుకునేలా విధిగా మాస్క్లను ధరించాలని, చేతులను సబ్బుతో కడక్కోవాలని, శానిటైజర్ విధిగా వాడాలని, సామాజిక దూరం పాటించాలని, 65 సం.లు పైబడిన వారు అంగన్ వాడీ కేంద్రం పరిధిలోకి రానివ్వొద్దని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *