* తైక్వాండో పోటీల పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ నివాస్
* హాజరైన సంయుక్త కలెక్టర్లు శ్రీనివాసులు, జిల్లా రెవిన్యూ అధికారి దయానిధి

శ్రీకాకుళం – జనాస వార్త
————————————-
శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆద్వర్యంలో ఈ నెల 31న ఆదివారం  నిర్వహిస్తున్న 21వ జిల్లా స్థాయి ఓపెన్ తైక్వాండో పోటీలు-2021కి సంబందించిన పోస్టర్లను  జిల్లా కలెక్టర్ జె.నివాస్,సంయుక్త కలెక్టర్లు డా. కె.శ్రీనివాసులు, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి గురువారం ఆవిష్కరించారు. న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సహకారంతో శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆద్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలు విజయవంతం కావాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఆకాంక్షించారు. క్రీడాకారులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని.జిల్లా పేరు ప్రతిష్టలను ఇనుమడించేలా పోటీలు నిర్వహించాలని వారు ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి వి.రవి, జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తైక్వాండో శ్రీను, ఏపిడబ్య్లు జెఎఫ్. రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్, జర్నలిస్టుల ఐక్య వేదిక కన్వీనర్ శాసపు జోగినాయుడు, పోటీల నిర్వాహకులు సుధీర్ వర్మ, వైశ్యరాజు మోహన్ ,తైక్వాండో గౌతమ్, తైక్వాండో నవీన్, పెయ్యల చంటి, మురళీ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *